ఇక మన చుట్టూ వున్న ప్రకృతిలో అనేక రకాల మొక్కలు ఉంటాయి. అందులో కొన్ని మొక్కలకు కాసిన కాయలు ఎంతో రుచిగా ఉంటాయి. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఎవరికీ కూడా తెలియకపోయినప్పటికీ ఆ కాయలను మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాం.ఇక ఇలా ఎంతో రుచిగా ఉండే, ఆరోగ్యానికి మేలు చేసే కాయలను ఇచ్చే మొక్కల్లో.. గాజు తీగ మొక్క అనేది కూడా ఒకటి. దీనిని అడవి ద్రాక్ష మొక్క ఇంకా అలాగే బుబటి తీగ మొక్క అని కూడా అంటారు. చెరువుల దగ్గర, తోటకు, పొలాలకు వేసే కంచెలకు ఇంకా అలాగే రేగి చెట్లకు ఈ తీగ మొక్క చాలా ఎక్కువగా అల్లుకుని పెరుగుతుంటుంది. ఈ మొక్క కాయలు కూడా చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఇక వీటిని నొక్క గానే ఒక రకమైన శబ్దం వస్తుంది.ఈ కాయల్లో నానబెట్టిన సబ్జా గింజల మాదిరి గింజలు కూడా ఉంటాయి. పూర్వకాలంలో గాజు తీగ మొక్క కాయలను ఎంతో ఇష్టంగా తినేవారట. ఈ కాయలను తినడం వల్ల మనం ఎన్నో రకాల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ తీగ మొక్కలు మనకు చాలా విరివిరిగా కనిపిస్తూనే ఉంటాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తీగ మొక్కలు వ్యాపించి ఉన్నాయి. ఇంకా అలాగే ఈ కాయలను తినడానికి పక్షులు కూడా ఇష్టపడతాయి. ముఖ్యంగా రామ చిలుకలు అయితే వీటిని తినడానికి చాలా ఎక్కువగా ఇష్టపడతాయి.


ఈ గాజు తీగ మొక్క ఆకులు యాంటీ సెప్టిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇక మనకు గాయాలు తగిలినప్పుడు ఈ మొక్క ఆకులను దంచి రసాన్ని తీసి ఆ రసాన్ని గాయాలపై వేయడం వల్ల ఆ గాయాలు చాలా త్వరగా మానుతాయి. గజ్జి ఇంకా అలాగే తామర వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా ఈ మొక్క మనకు చాలా బాగా సహాయపడుతుంది.ఇక ఈ తీగ మొక్క ఆకులను సేకరించి దంచి ఆ మిశ్రమాన్ని చర్మంపై రాయడం వల్ల గజ్జి ఇంకా అలాగే తామర వంటి సమస్యలు ఈజీగా తగ్గుతాయి. ఇక ప్రస్తుత కాలంలో నిద్రలేమి సమస్యతో బాధపడే వారు చాలా మందే ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడడానిక అనేక రకాల ప్రయత్నాలు కూడా మనం చేస్తూ ఉంటాం. ఈ నిద్రలేమి సమస్యను నయం చేయడంలో కూడా ఈ గాజు తీగ మొక్క చాలా బాగా ఉపయోగపడుతుంది. గాజు తీగ మొక్క ఆకులను ఎండబెట్టి కచ్చా పచ్చగా దంచి వాటితో కషాయాన్ని చేసుకుని ప్రతి రోజూ కూడా రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల చాలా త్వరగా నిద్ర త్వరగా పడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: