ప్రస్తుతం మారుతున్న లైఫ్ స్టైల్ లో రాత్రి 12 అయినా ఫోన్లు వాడుతున్నారు. అందులో ముఖ్యంగా యువత ఎక్కువగా వున్నారు. దీంతో ఉదయం వారు లేవడానికి చాలా బద్ధకిస్తున్నారు. దీంతో చిన్న వయసులోనే అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఓ వ్యక్తి జీవితంలో నిద్ర అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక రెండు రోజులు సరిగ్గా నిద్రపోకపోతే వెంటనే ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటుంటారు. ప్రతి వ్యక్తి ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోతే దానిని తక్కువ నిద్ర అని, ఎనిమిది గంటల కంటే ఎక్కవ నిద్ర పోతే దానిని ఎక్కువ నిద్ర అని అంటారు. ఈరెండింటిలో ఏది కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. అందుకే నిర్ణీత సమయం నిద్రపోవాలి. ఉదయం త్వరగా లేవకపోవడానికి, మన బద్ధకానికి కారణం నిర్ణీత సమయం నిద్రపోకపోవడమే. మన నుంచి బద్ధకాన్ని దూరం చేసి అనుకున్న టైమ్ కి లేవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.యువత ఎక్కువ మంది మొబైల్ ను అవసరానికి వాడటం కంటే కూడా దానికి బానిసలు అయిపోతున్నారు. దీంతో ఇంట్లో పిల్లలు కూడా మొబైల్ వాడకానికి అలవాటుపడిపోతున్నారు. చిన్న వయసు నుంచే వారు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోవడంతో మొబైల్స్ అనేవి వారి జీవితంలో భాగం అయిపోతున్నాయి.


పడుకునే ముందు మొబైల్స్ స్క్రీన్ లకు అతుక్కుపోవడం వల్ల వాటిపై ఎంత టైం గడుపుతున్నామో కూడా తెలియక, మనం నిద్రపోయే సమయాన్ని తగ్గించుకుంటున్నాం. దీంతో ఉదయం సమయానికి లేవలేక, బద్ధకంగా తయారవుతున్నారు. పడుకునే ముందు మొబైల్ ఫోన్ల వాడకాన్ని తగ్గించడం ద్వారా ఉదయం అనుకున్న సమయానికి నిద్ర లేవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. కనీసం ఏడు గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవాలి. అలా చేస్తే శరీరానికి కావల్సినంత విశ్రాంతి దొరుకుతుంది. ఉదయం మనం లేవాల్సిన సమయం ముందే అనుకుంటే దానికి అనుగుణంగా మన నిద్రను ప్లాన్ చేసుకోవాలి. అయితే రాత్రి 11 గంటల లోపే నిద్ర పోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


కొంత మంది ఎక్కువ సేపు మొబైల్ స్క్రీన్ లకు అతుక్కుని నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. ప్రతి రోజూ పడుకునే ముందు మొబైల్ తో కొంత సమయం గడపడం కొంతమందికి అలవాటుగానూ మారిపోతుంది. అయితే పడుకునే ముందు మొబైల్స్ ను దూరం పెట్టి త్వరగా పడుకోవడం కొద్ది రోజుల పాటు ప్రాక్టీస్ చేస్తే.. ఆవిధానానికి మన శరీరం అలవాటుపడుతుంది. దీంతో ఆరోగ్యంగా ఉండటంతో పాటు.. అనుకున్న సమయానికి లేవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: