
ఆర్థిక సమస్యలు..
చాలామంది ఎంత పని చేసినా,వారి సంపద వృద్ధి కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.వారింట్లో ఆర్థిక సమస్యల వల్ల అశాంతి నెలకొంటూ ఉంటుంది అలాంటివారు ఎర్రటి గన్నేరు పూలతో లక్ష్మీదేవిని పూజించటం వల్ల వారి సంపద క్రమంగా వృద్ధి చెందుతుంది.
భార్యాభర్తల సమస్యలు..
కొంతమంది ఇళ్లలో భార్యాభర్తలు చీటికి మాటికి గొడవలు పడుతూ ఉంటారు.అలాంటి వారి ఇంటిలో అశాంతి భావన,నిరాశ,నిస్పృహాలు ఎక్కువగా కనబడుతుంటాయి.ఇటువంటి భార్యాభర్తలు కలసి తెల్ల గన్నేరు పూలతో లక్ష్మీదేవికి 21 రోజులపాటు పూజించడం వల్ల వారి సమస్యలు సమిసిపోతాయి.
వ్యాపార సమస్యలు..
చాలామందికి ఎంత కష్టపడిన వ్యాపారం వృద్ధి కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు.అలాంటివారు వ్యాపారం ఉండే స్థానంలో లక్ష్మీ గణపతి ఉన్న ఫోటో తీసుకొని,వారిని రోజు గన్నేరు పూలతో పూజించడం వలన, లక్ష్మీదేవి ఆశీస్సులు కలిగి,ఎలాంటి విఘ్నాలైనా తొలగిపోయి,వ్యాపారం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది.
ఉద్యోగ సమస్యలు..
ఎంత ప్రయత్నించినా ఉద్యోగం దొరకక తెగ ఇబ్బంది పడుతుంటారు.అలాంటి వారు ఎర్రటి గన్నేరు పూల మాలను ప్రతి శుక్రవారం లక్ష్మిదేవికి వేసి,పూజించడం వల్ల,ఏవైనా దోషాలు ఉన్న తొలగి ఉద్యోగం ప్రయత్నాలు పలిస్తాయి.
సంతాన లేమి సమస్యలు..
పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత కూడా పిల్లలు కలగక, సంతానలేని సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివారు గన్నేరు పూలు మొక్కచుట్టూ 11 ప్రదక్షిణాలు 41 రోజులపాటు చేయడం వల్ల క్రమంగా సంతానలేమి సమస్యలు తగ్గుతాయి.