ఈ మద్యం కాలంలో యువత తప్పు దారి పడుతుంది అంటున్నారు అవును నిజమే.. చదువులు పూర్తయ్యేవరకు అమ్మానాన్నలతో ఉన్న వారు ఉద్యోగాల పేరుతో.. ఊరిదాటి మరి వస్తారు. అమ్మానాన్నలు ఉన్నారనే  అప్పుడు భయముండేది.. ఇప్పుడు ఎటువంటి అడ్డు ఆపు ఉండదు కదా దానితో రెచ్చిపోతున్నారు యువత.. ఇంకేం జరుగుతుంది రేపులని, మడ్డర్లని, సుసైడ్స్ అని ఎన్ని వార్తలు రోజు వద్దనుకున్నా వినపడతాయి. 



ప్రేమ పేరుతో చాలా మంది యువత సిటీ కల్చర్ కు అలవాటు పడి చాలా మంది యువత సెక్స్ అని అబ్బాయి, అమ్మాయిలు కలిసి తిరగాలని వయసులో తలెత్తే కోరికలను తీర్చుకొంటుంటారు. అలా ఇద్దరు కలిసి ఉండటం వల్ల. కొన్ని రకాల మనస్పర్థలు రావడం వంటివి జరగడం వల్ల చాలా రకాల వ్యసనాలకు బానిసలు అవుతుంటారు. జీవితాన్ని మధ్యలోనే తుంచి వేస్తారు. తల్లి దండ్రులకు శోకాన్ని మిగిల్చి లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. 



కార్పొరేట్‌ కొలువుల్లో పనిచేసే యువత ఈ తరహా జీవితాన్ని కోరుకుంటున్నారని కొందరు విశ్లేషకులు వివరిస్తున్నారు. హద్దులు దాటిన యువతలోనే ఎక్కువగా కుంగుబాటు లక్షణాలు కనిపిస్తున్నాయని, వారు సహజీవనం చేసిన నిజాన్ని దాచి పెట్టి, ప్రేమ బ్రేక్ అప్ వల్ల ఇలా మానసికంగా కుంగిపోతున్నామని అబద్దాలు చెప్పి మరీ చికిత్స కు కొందరు వస్తుంటారు అని నిపుణులు వెల్లడించారు. వారు కొన్ని సార్లు అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నారంటూ పేర్కొన్నారు.



మారుతున్న కాలం, పెరిగిన టెక్నలాజి వల్ల చాలా మంది యువత.. తెలియని వ్యక్తుల ప్రమేయం వల్ల చాలా రకాల సమస్యలను ఎదురుక్కొని.. జీవితాలను మొగ్గలోనే తుంచేకుంటున్నారు. అలా చాలా మంది చేస్తున్నారు. సమాజంలో కూడా ఎలాంటి సమస్య రోజు రోజుకి ఎక్కువ అవుతుంది. ఇది కనుక ఇలాగే కొనసాగితే యువత డిఫ్రెషన్ లో వెళ్ళిపోయి చావుల సంఖ్య పెరుగుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: