
ఈ చిట్కా కోసం ముందుగా ఒక బాండి తీసుకొని, అందులో అర లీటర్ వరకు కొబ్బరి నూనె వేసి,ఒక స్ఫూన్ ఆముదం,ఒక స్ఫూన్ మెంతులు,రెండు తమలపాకులు, రెండు నుంచి మూడు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించాలి.అవి దోరగా వేగిన తర్వాత బాండీ పక్కనపెట్టి,చల్లారనివ్వాలి.ఆ తర్వాత వడకట్టి గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.ఇలా ఒక్కసారి చేసుకుంటే నెల వరకు వస్తుంది.
అప్లై చేసుకునే విధానం..
ఈ నూనెను వాడాలి అనుకున్నప్పుడు మైల్డ్ గా వేడి చేసి,గోరువెచ్చగా వున్నప్పుడు తలకు బాగా మర్దన చేయాలి.ఆ తర్వాత గాడత తక్కువ ఉన్న షాంపూలతో స్నానం చేస్తే సరిపోతుంది.ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.ఈ నూనెను అప్లై చేసుకోవడంతో రక్త ప్రసరణ బాగా జరిగి,తలపై హెయిర్ పాలికల్స్ ఓపెన్ అయి, జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి దోహదపడుతుంది.
ఈ ఇంటి చిట్కాలతో పాటు జీవన శైలిలో మార్పులు,మంచి ఆహారం తీసుకోవడం,సరైన నిద్ర వ్యాయామం చేయడం లేదా యోగా చేయడం,స్ట్రెస్ తగ్గించుకోవడం,డిహైడ్రేషన్ కాకుండా నీరు ఎక్కువ తాగడం,ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ కి దూరంగా ఉండడం వంటివి చేయాలి.మరీ ముఖ్యంగా విటమిన్ ఈ అధికంగా ఉన్న ఆహారాలు తీసుకోవడంతో జుట్టుని ఒత్తుగా,దృఢంగా పెంచుకోవచ్చని ఆహార నిపుణులు కూడా చెబుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ అమ్మమ్మల నాటి చిట్కాలు తప్పక పాటించి,ఒత్తైన జుట్టును మీ సొంతం చేసుకోండి.