సాధారణంగా సీనియర్ సిటిజనుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తూ వాటి ద్వారా అధిక వడ్డీని కూడా అందజేస్తున్న విషయం తెలిసిందే. ఇక మీరు కూడా సీనియర్ సిటిజన్ అయితే మీకోసం ఒక చక్కటి శుభవార్త అని చెప్పవచ్చు. డిపాజిట్ పథకాలలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్న వారికి ఒక మంచి అవకాశం అని చెప్పాలి.

తాజాగా ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు, సీనియర్ సిటిజన్లు ఇతరుల కోసం ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా తమ కష్టమర్లు పొదుపుపై 8.51 శాతం వరకు వడ్డీ పొందుతారని మరొకవైపు సీనియర్ సిటిజన్ లు  కనీసం రూ. 5000 డిపాజిట్ తో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 9.11% వడ్డీ లభిస్తుంది అని స్పష్టం చేసింది. అయితే ఇలా పెంచిన వడ్డీ రేట్లు మే 25 2023 నుంచి అమలులోకి వస్తాయని కూడా స్పష్టం చేయడం జరిగింది.

ఇకపోతే ఫిన్ కేర్ బ్యాంకులో ఏడు నుండి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్ లకు మూడు శాతం వడ్డీ లభిస్తే ..అదే 46 రోజుల నుండి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్డ్ డిపాజిట్లకు 4.5% వడ్డీ కూడా లభిస్తుంది. అలాగే 180 రోజులకు 5.5 సినిమా శాతం వడ్డీ 365 రోజులకు 6.25% వడ్డీ లభిస్తుంది. 499 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్ ల పై 7.5% వడ్డీ అదే 500 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్ డిపాజిట్ ల పై 8.1% వడ్డీ లభిస్తుంది. ఇక 750 రోజుల వ్యవధి డిపాజిట్లకు 8.31% వడ్డీ లభిస్తుంది. అయితే ఈ వడ్డీ రేట్లు సీనియర్ సిటిజనులకు మారుతూ ఉంటాయని గమనించాలి. మొత్తానికైతే ఈ బ్యాంకు తన మొబైల్ యాప్ , వాట్సప్, బ్యాంకింగ్ , యూపీఐ, ఐఎంపీఎస్ పలు చెల్లింపు ఎంపికల ద్వారా కూడా సేవలను అందిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: