అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సక్సెస్ కోసం అక్కినేని ఫ్యామిలీ అంతా తెగ కష్టపడుతుంది. గత కొంత కాలంగా నాగార్జునకి తప్ప కొడుకులకి సరైన సక్సెస్ రావటం లేదు. నాగచైతన్య నటిస్తున్న మూవీలు రిలీజ్ కి ముందు మంచి టాక్ వస్తున్నప్పటికీ…రిలీజ్ తరువాత మాత్రం యావరేజ్ గా సక్సెని సాధిస్తున్నాయి. దీంతో నాగార్జున ఆలోచనల ప్రకారం నాగచైతన్యకి మంచి కాంబినేషన్ ని సెట్ చేశారు.


అదే నాగ చైతన్య నటిస్తున్న తాజా చిత్ర్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’. ప్రస్తుతం ఈ సినిమా ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. మూడు రోజుల క్రితం విడుదలైన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ట్రైలర్ కి మంచి స్పందన వస్తుంది. ఇక ట్రైలర్ లో నాగచైతన్య చెప్పిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ మూవీపై ఇంతటి పాజిటివ్ వేవ్స్ ఉన్నప్పటికీ…ఇంకా వీటిని మరింత పెద్దదిగా చేసేందుకు సమంత సైతం రంగంలోకి దిగింది.


నాగచైతన్య నటించిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీపై పాజిటివ్ ట్వీట్స్ ని చేస్తుంది. అలాగే ఫేస్ బుక్ అకౌంట్స్ లోనూ ‘రారండోయ్ వేడుక చూద్దాం’ మూవీ గురించే మాట్లాడుతుంది. ఈ మూవీని ప్రతి ఒక్కరు తప్పకుండా చూడాల్సిందే అంటూ సమంత తన ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా చెబుతుంది.


మొత్తంగా నాగచైతన్య సక్సెస్ కోసం సమంత చేస్తున్న ప్రమోషన్స్ ని చూస్తుంటే…ఈ మూవీపై సమంత కూడ ఎక్స్ పెక్టేషన్స్ ని పెట్టుకున్నట్టు తెలుస్తుంది. దీంతో భారీ అంచనాల్ని క్రియేట్ చేసుకున్న ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఈ నెల26న విడుదలకానుంది. ఫ్యాన్స్ సైతం ఈ మూవీ కోసం తెగ ఆసక్తి చూపుతున్నారు. విశేషం ఏమిటంటే ఈ మూవీని ఇండియాలో భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: