
నందమూరి బాలకృష్ణ కొత్త సినిమాపై చాలా నెలల నుంచి వస్తున్న రూమర్లకు.. వాటితో నెలకొన్న కన్ఫ్యూజన్ కు ఈరోజుతో తెరపడింది. ఫుల్ క్లారిటీ వచ్చింది.‘ఎన్టీఆర్ మహానాయకుడు’ చిత్రం తరువాత నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. 2018లో ‘జై సింహా’ చిత్రంతో హిట్ కొట్టిన బాలయ్య.. ఆ చిత్ర దర్శకుడు కేఎస్ రవికుమార్ రిపీట్ చేశారు. సీకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సి. కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలతో గురువారం నాడు షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది.
ఈ సినిమా కోసం బాలయ్య గడ్డం పెంచి డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నారు. కెయస్ రవికుమార్ - బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న రెండవ సినిమా ఇది. చిరంతన్ భట్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రాఫర్. పరుచూరి మురళి కథకు రత్నం డైలాగ్స్ అందించారు. సీ. కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జులై నుండి ప్రారంభిస్తారు.