తమిళ మూవీ ‘96’ రీమేక్ కోసం శర్వానంద్ ప్రయత్నిస్తూ ఆమూవీలోని తన పాత్రకు సంబంధించిన స్కై డైవింగ్ శిక్ష‌ణ తీసుకుంటున్న స‌మయంలో శ‌ర్వానంద్ భుజం కాలికి తీవ్రగాయాలు అయిన విషయం తెలిసిందే. దీనితో మేజర్ సర్జరీ చేయించుకున్న శర్వానంద్ కు కనీసం రెండు నెలలు రెస్ట్ కావాలనీ స్వయంగా డాక్టర్స్ కూడ తెలిపారు.

ఇలాంటి పరిస్థుతులలో అందరికీ షాక్ ఇస్తూ ఫిట్ గా మారిపోయిన శర్వానంద్ నిన్న తన లేటెస్ట్ మూవీ ‘శ్రీకారం’ ప్రారంభోత్సవానికి రావడమే కాకుండా ఆమూవీని సంక్రాంతి రిలీజ్ కు రెడీ పెడుతున్నట్లు ప్రకటించడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. గతంలో శర్వానంద్ నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’ ‘శతమానం భవతి’ సినిమాలు సంక్రాంతి రేస్ కు వచ్చి విజయవంతమైన నేపధ్యంలో ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతూ ఈప్రకటన చేసారు అని భావించినా అసలు శర్వానంద్ కు ఇది సాధ్యం అయ్యే పనియేనా అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

ప్రస్తుతం శర్వానంద్ ‘96’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే కొంతవరకు పూర్తి అయింది. ఇలాంటి పరిస్థితులలో ‘శ్రీకారం’ మూవీని రాబోతున్న ఐదు నెలలలో పూర్తిచేస్తే కాని శర్వా తన సినిమాను సంక్రాంతి రేసుకు నిలబెట్టలేడు. ఇలాంటి పరిస్థితులలో అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి అంటూ నిన్న జరిగిన శర్వానంద్ ‘శ్రీకారం’ మూవీ పూజా కార్యక్రమం పై కామెంట్స్ వస్తున్నాయి. 

అయితే శర్వానంద్ అత్యంత ఆశ్చర్యకరంగా తనకు తగిలిన దెబ్బల గుర్తులు ఏమి కనిపించకుండా బయటకు వచ్చిన శర్వానంద్ లుక్ ను చూసినవారు అసలు నిజంగా శర్వానంద్ కు యాక్సిడెంట్ జరిగిందా అంటూ కామెంట్స్ చేసినట్లు టాక్. సుమారు 11 గంటల సర్జరీ చేయించుకున్న వ్యక్తి నిన్న ఫిట్ గా కనిపించడమే కాకుండా ఏకంగా తన లేటెస్ట్ మూవీని సంక్రాంతి రేస్ కు మహేష్ అల్లు అర్జున్ ల మూవీలతో సమానంగా విడుదల చేస్తాను అంటూ ప్రకటించడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారి ఇందులోని మ్యాజిక్ ఏమిటి అన్న కోణంలో చర్చలు జరుగుతున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: