డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎప్పటినుండో మెగాస్టార్ చిరంజీవి తో  సినిమా చేయాలి అది తన డ్రీమ్ అని చాలాసార్లు చెప్పడం జరిగింది. గతంలో చిరంజీవి 150వ సినిమా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నట్లు ఆ సినిమా టైటిల్ “ఆటో జానీ” అన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ స్టోరీ చిరంజీవి విని ఫస్ట్ ఆఫ్ బాగున్న సెకండ్ ఆఫ్ సరిగ్గా లేదని పక్కన పెట్టడం జరిగింది. ఇదే తరుణంలో చిరంజీవి "మీలో ఎవరు కోటీశ్వరుడు" ప్రోగ్రాం కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సమయములో … ఓ ప్రముఖ సెలబ్రిటీ ఆడుతున్న టైంలో చిరంజీవి.... పూరి జగన్నాథ్ మధ్య ఫోన్ కాల్ కాన్వర్జేషన్ వచ్చినప్పుడు కచ్చితంగా నీతో సినిమా చేస్తాను అని చిరంజీవి పూరికి మాట ఇచ్చారు.

IHG

అయితే తాజాగా ఆ మాట ఇప్పుడు నెరవేర్చుకోడానికి చిరంజీవి రెడీ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ ఒక సాలిడ్ స్టోరీ రెడీ చేసినట్లు టాక్. కరోనా కారణంగా లాక్ డౌన్ టైం లో చిరంజీవి కి స్క్రిప్ట్ రెడీ చేశారట. త్వరలోనే చిరంజీవికి పూరి వినిపించ బోతున్నట్లు, అంతా ఓకే అయితే విజయ్ దేవరకొండతో  తర్వాత ఈ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు  సమాచారం. ప్రస్తుతం చిరంజీవి.. కొరటాల శివ దర్శకత్వంలో "ఆచార్య" సినిమా చేస్తున్నారు.

IHG's cheeky reply to <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DIRECTOR' target='_blank' title='director-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>director</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=PURI JAGANNADH' target='_blank' title='puri jagannadh-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>puri jagannadh</a> on <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=TWITTER' target='_blank' title='twitter-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>twitter</a> ...

ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు 40 శాతం అయిపోయింది. లాక్ డౌన్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోవటంతో త్వరలో స్టార్ట్ కానుందట. అంతా ఓకే అయితే "ఆచార్య" అదేవిధంగా పూరి తో విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా షూటింగ్లు ఒక్కసారే కంప్లీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో స్టోరీ ఓకే అయితే  వెంటనే చిరంజీవి పూరీతో చేయాలని, “లూసిఫర్” ప్రాజెక్టును పక్కన పెట్టాలని డిసైడ్ అయినట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: