
వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘పవర్ స్టార్’ అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి కొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రస్థాయిలో విభేదిస్తున్నారు. అంతేకాకుండా రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై కూడా దాడి చేయడం జరిగింది. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఆర్జీవి వరల్డ్ లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ఏ రకంగా చూసినా అడ్డుకోలేని పరిస్థితి. ఇటువంటి తరుణంలో సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ని టార్గెట్ చేసుకుని తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. సినిమాని ఎవరూ చూడకూడదని ఇలాంటి డైరెక్టర్లను సపోర్ట్ చేస్తే రాబోయే రోజుల్లో సమాజంలో ఈ రకంగానే గొడవలు చోటుచేసుకుంటాయి అంటూ ప్రచారం చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు చేస్తున్న ఈ ప్రచారానికి కొంతమంది హీరోల అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. కాగా అప్పట్లో కరోనా వైరస్ కష్టకాలంలో విజయ్ దేవరకొండ పై ఒక వెబ్ సైట్ నీచమైన రాతలు రాసిన టైములో.. విజయ్ దేవరకొండ మీడియా సమావేశం పెట్టి ఆ వెబ్ సైట్ ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.
ఆ సమయంలో అనేక మంది స్టార్ హీరోలతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా సపోర్ట్ చేయటం జరిగింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులు ఆర్జివి సినిమాలు చూడకూడదు అని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో విజయ్ దేవరకొండని సపోర్ట్ అడుగుతున్నారట. ఎలాగైనా ఈ విషయంలో మాకు సపోర్ట్ ఇవ్వండి అని విజయ్ దేవరకొండ ని పవన్ ఫ్యాన్స్ కోరుతున్నట్లు ఫిలింనగర్ టాక్.