స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన సినిమాల సక్సెస్ లతో మాత్రమే కాదు తనకు నచ్చిన సినిమాలు సక్సెస్ అయినా చాలా సంతోషిస్తాడు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ తో తీసిన సినిమాలు చూసి నచ్చితే ట్విట్టర్ ద్వారా వారికి శుభాకాంక్షలు అందించడమే కాకుండా ఆ చిత్రయూనిట్ ను పిలిచి తన స్పెషల్ విషెస్ అందిస్తాడు. లేటెస్ట్ గా అల్లు అర్జున్ సుహాస్, చాందిని చౌదరి కాంబోలో వచ్చిన కలర్ ఫోటో సినిమా యూనిట్ కు అల్లు అర్జున్ ప్రశంసలు అందించారు.

సినిమా చూసిన అల్లు అర్జున్ ఈమధ్య కాలంలో చూసిన మంచి సినిమా అని చెప్పారు. అంతేకాదు చిత్రయూనిట్ ను తన ఆఫీస్ కు పిలిచి వారితో సినిమా గురించి మాట్లాడారు. సందీప్ రాజ్ డైరక్షన్ లో వచ్చిన కలర్ ఫోటో సినిమా ఆహాలో రిలీజైంది. ఈ సినిమా చూసిన స్టార్స్ చిత్రయూనిట్ ను మెచ్చుకుంటున్నారు. అయితే అందరి కంటే ముందు అల్లు అర్జున్ సినిమా యూనిట్ కు పిలిచి తన విషెస్ అందించారు.

మొత్తానికి కలర్ ఫోటో అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యిందని చెప్పొచ్చు. మాములుగా ఇలాంటి చిన్న సినిమాలకు స్టార్స్ ప్రమోషన్ మంచి బూస్టింగ్ ఇస్తుంది. తప్పకుండా కలర్ ఫోటో మరికొందమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆహాలో రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో సునీల్ విలన్ గా నటించడం విశేషం. మొత్తానికి కమెడియన్ సుహాస్ హీరోగా మొదటి సినిమా సూపర్ హిట్ అయ్యింది.      

                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: