
మెగా ఫ్యామిలీలో విలక్షణమైన యువ నటుడు వరుణ్ తేజ్. ఫస్ట్ మూవీ నుంచి రొటీన్ ఫార్మాట్లో కాకుండా కొత్త కొత్త కంటెంట్‌తోనే అలరించే ప్రయత్నం చేస్తున్నాడు. అదే తరహాలో తాజాగా వస్తున్న వరుణ్ సినిమా ‘గని’. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. కాగా.. ఇప్పటికే గని సినిమా షూటింగ్ 70 శాతం కంప్లీట్ చేసుకుంది. ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్లో ఈ షూట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో వరుణ్ సరసన సాయీ మంజ్రేకర్ హీరోయిన్గా నటిస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని బన్నీ వాస్, అల్లు బాబీలు ఈ సినిమాన్ని నిర్మిస్తున్నారు.
ఇలాంటి సందర్భంలోనే ఈ సినిమా మేకర్స్ నుంచి ఓ సాలిడ్ అప్డేట్ బయటకు వచ్చింది. మూవీలోని ఓ అదిరిపోయే ఫైట్ సీక్వెన్స్ కోసం భారీ సెట్ వేస్తున్నారట. అంతేకాదు ఈ పర్టిక్యులర్ సన్నివేశం కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవెల్, వాడ్ రింబర్లను రంగంలోకి దించుతున్నారని కూడా తెలుస్తోంది. హాలీవుడ్లో టైటాన్స్, బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ వంటి చిత్రాలకు లార్నెల్ స్టోవెల్, వాడ్ రింబర్లు యాక్షన్ సీక్వెన్స్ అందించారు. వీరి నేతృత్వంలో గనిలోని కీలక ఫైట్ సీన్ కోసం సాలిడ్ యాక్షన్ సీక్వెన్స్ నిర్మిస్తున్నట్లు కన్ఫర్మేషన్ అందుతోంది.