సినిమాల్లో నటులు వివిధ రకాల పాత్రలు చేయాలని వాటి ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవడం సహజం. దానికోసం ప్రపంచంలో ఎన్ని రకాల పాత్రలు అయితే ఉన్నాయో అన్ని రకాల పాత్రలు చేయడానికి ఆశపడుతుంటారు. వివిధ రకాల వృత్తులు, వివిధ రకాల మనుషులు ఉన్నట్లుగానే సినిమాల్లో కూడా పాత్రలు ఆవిధంగా రూపొందించి వాటిలో నటించి వాటి ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తుంటారు. అలా మన హీరో హీరోయిన్లు చాలామంది టీచర్లుగా లెక్చరర్ లుగా నటించారు.. వారెవరెవరో ఒకసారి చూద్దాం..

హీరోయిన్ సుహాసిని ఆరాధన సినిమాలో టీచర్ పాత్ర పోషించి తనదైన ప్రత్యేకతను చాటుకున్నారు. హీరో చిరంజీవి కి మెంటర్ గా ఈ సినిమాలో నటించి హీరోయిన్ గా మరో మెట్టు పైకి ఎక్కారు. గోవా బ్యూటీ ఇలియానా రవితేజ హీరోగా నటించిన ఖతర్నాక్ సినిమాలో టీచర్ పాత్రను పోషించి ఆ వృత్తికే వన్నె తెచ్చారు. మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రేమమ్ సినిమాలో సాయి పల్లవి టీచర్ పాత్రలో నటించగా ఆ సినిమా తెలుగులో నాగచైతన్య రీమేక్ చేయగా సాయి పల్లవి పోషించిన టీచర్ పాత్ర శ్రుతిహాసన్ పోషించి ప్రేక్షకులను మెప్పించారు. ఆర్య హీరోగా నటించిన నేనే అంబానీ సినిమాలో కూడా నయనతార లెక్చరర్ గా నటించారు.

శివ కార్తికేయన్ హీరోగా నటించిన సీమ రాజా సినిమాలో సమంత స్పోర్ట్స్ టీచర్ గా నటించి మెప్పించారు. అనుపమ పరమేశ్వరన్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా నటించిన రాక్షసుడు సినిమా లో టీచర్ పాత్ర పోషించి ఎంతో చక్కగా ఒదిగిపోయారు. హీరోయిన్ ఆసిన్ కూడా వెంకటేష్ గౌతమ్ మీనన్ ల కాంబినేషన్ లో వచ్చిన ఘర్షణ సినిమాలో టీచర్ పాత్రను పోషించారు. అలనాటి హీరోయిన్ రమ్యకృష్ణ అంతకుముందు కొన్ని సినిమాల్లో ఉపాధ్యాయురాలిగా కనిపించగా లేటెస్ట్ గా సిద్ధార్థ తమన్నా హీరోహీరోయిన్లుగా నటించిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా లో లెక్చరర్ గా నటించారు. అక్షర సినిమాలో నందిత శ్వేత ప్రొఫెసర్ గా నటించగా, సరిలేరు నీకెవ్వరు సినిమా లో విజయశాంతి, హ్యాపీడేస్ సినిమాలో కమలిని ముఖర్జీ, గోల్కొండ హై స్కూల్ సినిమాలో స్వాతి లు టీచర్స్ గా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: