మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత టాలీవుడ్ లో ఏం జరుగుతుంది ఏంటనే దానిపై అందరూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి మెగా ఫ్యామిలీ అనుకున్నది జరగకపోవడంతో ప్రకాష్ రాజ్ ను రంగంలోకి దింపి విమర్శలు చేస్తున్నారు అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి. ప్రకాష్ రాజు చేసిన వ్యాఖ్యలు అలాగే ప్రకాష్ రాజు సభ్యులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా ఉన్నాయి అనే విషయం క్లియర్ గా అర్థం అవుతోంది. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మా ఎన్నికల తర్వాత కొత్త అసోసియేషన్ పెట్టే ఆలోచన చేస్తున్నారనే ప్రచారం జరిగింది.

అయితే ఇప్పుడు మరో విషయం కూడా టాలీవుడ్ వర్గాల్లో బాగా చర్చకు వస్తుంది. మా ఎన్నికల్లో మంచు విష్ణుకి నందమూరి బాలకృష్ణ మద్దతు ఇవ్వడాన్ని మెగా ఫ్యామిలీ ఏమాత్రం కూడా జీర్ణించుకోలేకపోతోంది. బాలకృష్ణ మద్దతు ఇవ్వడంతో గెలిచారు అనే అభిప్రాయం కూడా టాలీవుడ్ వర్గాల్లో ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు అనూహ్యంగా అల్లు అరవింద్ బాలకృష్ణ పై ప్రశంసలు కురిపించడం ఆశ్చర్య కరంగా మారింది. బాలకృష్ణ ను ఇటీవల ఒక కార్యక్రమం ఓపెనింగ్ సందర్భంగా అల్లు అరవింద్ ప్రశంసలతో ముంచెత్తారు.

ఎప్పుడూ లేనివిధంగా బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి ఆయన చేసిన కామెంట్స్ బాగా హైలెట్ అయింది. అయితే ఇప్పుడు బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాకు అల్లు అరవింద్ నిర్మాతగా ఉండే అవకాశాలున్నాయని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి అల్లు అరవింద్ ఆసక్తికరంగా ఉన్నారని ఈ సినిమా ను నిర్మించేందుకు అల్లు అరవింద్ బాలకృష్ణ తో మాట్లాడారు అని కూడా తెలుస్తోంది. ఈ సినిమా లో దాదాపుగా 50 శాతం షేర్ కావాలని అల్లు అరవింద్ అడిగారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజం ఏంటి అనేది తెలియాలంటే కొంత కాలం వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: