టాలీవుడ్ లో ఇప్పుడు అందరి దృష్టి పెద్ద సినిమాల మీదే ఉంది. ఈ క్రమంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎప్పుడు థియేటర్లలోకి వస్తోందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 7న‌ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ క్రమంలోనే ముందుగా ఆర్ ఆర్ ఆర్ సినిమాకు పోటీగా గంగు భాయ్ క‌తియావాడీ సినిమా కూడా రావాలని అనుకుంది. ఆ సినిమాకు జ‌న‌వ‌రి 6న రిలీజ్ డేట్ వేశారు. ఈ సినిమా పై కూడా దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలే ఉన్నాయి.

దీనిపై రాజమౌళిని ప్రశ్నిస్తే క‌రోనా తర్వాత ఇలాంటి పోటీ అనివార్య‌మే అని చెప్పారు. ఒకటి కాదు రెండు కాదు విష‌యం ఉంటే ఎన్ని సినిమాలు అయినా ఒకే సారి రిలీజ్ కావ‌చ్చు అని చెప్పారు. రాజమౌళి మాటలను బట్టి చూస్తే తన సినిమా వల్ల ఇంకో సినిమాకు ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీగా చెప్పినట్టు ఉంది. అయితే అలాంటి రాజమౌళి ఇప్పుడు తన ఆర్ ఆర్ ఆర్ సినిమాకు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర‌ పోటీ లేకుండా చేసేందుకు తెర వెన‌క‌ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

గంగూబాయి క‌తియావాడీ సినిమాను ఆర్ ఆర్ సినిమాకు భ‌య‌ప‌డి వాయిదా వేయ‌లేద‌ట‌. కేవ‌లం రాజ‌మౌళి రిక్వెస్ట్ చేసినందునే వాయిదా వేశార‌ని బాలీవుడ్ వ‌ర్గాల టాక్ ?  అయితే ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న భీమ్లా నాయ‌క్ మూవీని జ‌న‌వ‌రి 12 నుంచి డేట్ మార్చేలా చేయాల‌ని రాజ‌మౌళి గ‌ట్టిగా ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టు టాక్ ? ఈ విష‌యం ఇప్పుడు టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్ లో పెద్ద టాపిక్ అయ్యింది.

దిల్ రాజు నేతృత్వంలోని ప్రొడ్యూస‌ర్స్ గిల్డ్ చేసిన ప్ర‌య‌త్నం కూడా విఫ‌ల‌మైంద‌ట‌. దీంతో ఆ సినిమా నిర్మాత‌లు కూడా తాము జ‌న‌వ‌రి 12నే వ‌స్తామ‌ని ప‌దే ప‌దే పోస్ట‌ర్లు వేస్తున్నారు. దీంతో రాజ‌మౌళి నేరుగా రంగంలోకి దిగి ఆ సినిమా నిర్మాత‌ల‌ను బ‌తిమి లాడుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: