"ఛత్రపతి".. ఈ సినిమాని ఎన్ని సార్లు చూసిన ఇంకా చూడాలి అనిపించేలా తెరకెక్కించాడు రాజమౌళి. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ ని ఇంట్రెస్టింగా తీర్చిదిద్దాడు జక్కన్న . అప్పటి వరకు ప్రభాస్ తీసిన సినిమాలు అన్నీ ఒక్క ఎత్తు అయితే ఈ ఛత్రపతి సినిమా తరువాత ప్రభాస్  రేంజ్, ఫాలోయింగ్, రెమ్యూనరేషన్ అన్నీ  వేరే లేవల్ అని చెప్పాలి. పక్కాగా చెప్పాలి అంటే ఈ సినిమానే ప్రభాస్ కెరీర్ ను మలుపు తిప్పింది . యాక్టింగ్ పరంగా చూసిన, ఎక్స్ ప్రేషన్స్ చూసినా ఈ సినిమాలో ప్రభాస్ ఇరగదీసాడు అంటారు అభిమానులు.  ఛత్రపతి సినిమా ప్రభాస్ జీవితంలో ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్‌ ఇమేజ్ నెక్ట్స్ లెవల్‌కు వెళ్లి..ఇప్పుడు పాన్ ఇండియా హీరో సినిమాలు చేస్తూ మిగతా ఏ హీరో కూడా టచ్ చేయలేనంత దూరంలో ఉన్నాడు.

సినిమా ద్వారా ప్రభాస్ మాత్రమే కాదు మిగత క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా మంచి పేరు వచ్చింది.  ఈ సినిమాలో సూరీడు పాత్రలో నటించిన చైల్డ్‌ ఆర్టిస్ట్‌ భశ్వంత్‌ వంశీ, సూరీడు తల్లిగా నటించిన అనితా చౌదరి. ఇక ప్రభాస్ ఫ్రెండ్స్ గా నటించిన అజయ్, చంద్రశేఖర్ కి కూడా ఈ సినిమా తరువాత మంచి మంచి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా చంద్రశేఖర్ కు ఈ సినిమా బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. అందుకే ఆయన ఈ సినిమా తరువాత ఆయన పేరుని ఛత్రపతి చంద్రశేఖర్ గా మార్చుకున్నారట. ఈయన ఎన్నో సీరియల్స్ కూడా నటించారు. తన అద్భుతమైన నటనను గుర్తించిన డైరెక్టర్స్ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంతో  సీరియల్స్ ను వదిలేసి పూర్తిగా సినిమాల వైపు వచ్చేసాడు.

అయితే నటుడిగా ఈయన గురించి అందరికి బాగా తెలుసు. కానీ ఫ్యామిలీ పరంగా చంద్రశేఖర్ గురించి చాలా మందికి తెలియదు. తన నటనతో అందరిని అలరించిన చంద్రశేఖర్  భార్య కూడా ఓ నటినే కావడం విశేషం . ఆయన భార్య పేరు  నిలీయ భవాని... ఈమె పలు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి మనల్ని మెప్పించింది. ముఖ్యంగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన  "పండగ చేస్కో",  రవి తేజ నటించిన్ "కిక్2", చిరంజీ నటించిన "సైరా నరసింహారెడ్డి" లాంటి చాలా సినిమాల్లో నటించి తన నటనకు అభిమానుల దగ్గర మంచి మార్కులే వేయించుకుంది. కేవలం తెలుగులోనే కాదు తమిళంలోనూ ఈమె నటించింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్, విజయ్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో మెరిసి.. అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఓ వైపు సినిమాలు మరో వైపు  సీరియళ్లలోనూ నటిస్తూ బిజీ బిజీగా కెరీర్ ను ముందుకు కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: