‘సోగ్గాడే చిన్న నాయనా’ తరువాత నాగార్జున నుండి ఎన్నో సినిమాలు వచ్చినా ఆ సినిమాలు అన్నీ ఫ్లాప్ లుగా మారాయి. గత మూడు సంవత్సరాలుగా నాగ్ సినిమాల విషయంలో చేస్తున్న ప్రయోగాలు అన్నీ విఫలం అయ్యాయి. గడిచిన మూడు సంవత్సరాలలో నాగార్జున బుల్లితెర పై నాగార్జున ‘బిగ్ బాస్’ షోను హోస్ట్ చేయకుండా ఉండి ఉంటే నేటితరం ప్రేక్షకులతో నాగార్జునకు కనెక్షన్ కూడ తెగిపోయి ఉండేది.


ఇలాంటి పరిస్థితులలో నాగార్జునకు ఒక మంచి హిట్ కావాలి. ఆ హిట్ తనకు ‘బంగార్రాజు’ ఇస్తుందని చాల గట్టి నమ్మకంతో ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో కరోనా ఒమైక్రాన్ కేసులు పెరుగుపోతున్నా వాటిని లెక్కచేయకుండా నాగ్ సంక్రాంతికి వస్తున్నాడు. ఈసినిమాకు పోటీగా డబ్బింగ్ సినిమాలు చిన్న సినిమాలు తప్ప మరే పెద్ద సినిమా లేకపోవడంతో తనకు కలక్షన్స్ వర్షం కురుస్తుందని నాగార్జున నమ్మకం.



ఎప్పటి నుండో నాగార్జున 100 కోట్ల కలక్షన్స్ క్లబ్ లో చేరాలని ఆశ పెట్టుకున్నాడు. సీనియర్ హీరోలలో లేటెస్ట్ గా బాలకృష్ణ కూడ 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడంతో నాగ్ కు ఈవిషయమై మరింత కోరిక పెరిగింది. దీనితో టాప్ హీరోలతో పోటీలేని ఈ సంక్రాంతి తనకు కలిసి వస్తుందని నాగార్జున నమ్మకం. ‘లవ్ స్టోరీ’ ఘన విజయంతో నాగచైతన్యకు యూత్ లో మంచి క్రేజ్ పెరిగింది.


దీనితో యూత్ ప్రేక్షకులతో పాటు తనకు ఫ్యామిలీ ప్రేక్షకులలో ఉన్న క్రేజ్ తో వారంతా పండగ రోజులలో ‘బంగార్రాజు’ మూవీ చూడటానికి ధియేటర్లకు వస్తే తన 100 కోట్ల కల చాల సులువుగా నెరవేరుతుందని ఆశతో రంగంలోకి దిగుతున్నాడు. అందువల్లనే పరిస్థితులు ఎలా ఉన్నా టిక్కెట్ల రేట్ల వివాదం తేలకపోయినా తనకు సంబంధంలేదు అంటున్నాడు. ఇలాంటి కామెంట్స్ నాగార్జున నోటి నుండి రావడంతో చాలామంది సోషల్ మీడియాలో నాగార్జున తన ‘బంగార్రాజు’ కోసం స్వార్థపరుడుగా మారిపోయాడు అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: