అప్పట్లో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’ మూవీని ఆనాటితరం ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేసారు. అయితే ఆ మూవీలో చిరంజీవి నటించిన డాక్టర్ పాత్రను రౌడీగా చూపెట్టడం తప్పు అంటూ ఆరోజులలో కొందరు డాక్టర్లు ఆమూవీ పై తమ నిరసన వ్యక్త పరిచారు. అయితే అప్పట్లో సోషల్ మీడియా అందరికీ అందుబాటులో లేకపోవడంతో ఈవివాదం పెద్దది అవ్వకుండా ముగిసిపోయింది.



అయితే ఇప్పుడు సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి రావడంతో ఏచిన్న విషయం అయినా అనుకుంటే పెద్ద వివాదంగా మారిపోతోంది. దీనికితోడు సమాజంలోని సామాజిక వర్గాలు తమ వర్గానికి కార్నర్ అయ్యేలా ఏవార్త ఉన్నా అదేవిధంగా సినిమాలలో ఏ చిన్న సన్నివేశం ఉన్నప్పటికీ వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. దీనితో ప్రతి చిన్న విషయం ఒక సమస్యగా మారుతోంది.



ఇప్పుడు లేటెస్ట్ గా ‘ఆచార్య’ మూవీ విషయంలో కూడ అదే జరిగింది. కొరటాల సినిమాలు అన్నీ సామాజిక స్పూర్తితో ఉంటాయి. దీనితో ఈసినిమాల పై వివాదాలు పెద్దగా ఉండవు. అయితే ‘ఆచార్య’ మూవీలో చిరంజీవి రెజీనా లపై చిత్రీకరించిన ఐటమ్ సాంగ్ లో ఒక చరణం ఆర్ ఎమ్ పి డాక్టర్లను కించపరిచేలా ఉంది అంటూ సరికొత్త వివాదం మొదలైంది. అంతేకాదు ఆర్ ఎమ్ పి డాక్టర్ల సంఘాలు ‘ఆచార్య’ మూవీలోని ఐటమ్ సాంగ్ నుండి ఆ అసభ్యకర పదాలను తొలగించాలి అంటూ డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలు కూడ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ఇప్పుడు ఈవిషయం ఈమూవీ నిర్మాతల వరకు చేరడంతో ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా పరిస్థితులు వల్ల ఫిబ్రవరి మొదటివారంలో ఈమూవీ విడుదల అవుతుందో లేదో తెలియని పరిస్థితులలో ‘ఆచార్య’ చుట్టూ ఈ అనవసరపు వివాదాలు ఏమిటి అంటూ తలపట్టుకుంటున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ‘ఆచార్య’ మూవీ కూడ వాయిదా పడితే ఈమూవీ కూడ సమ్మర్ రేస్ ను టార్గెట్ చేయవచ్చు దీనితో ఎన్ని భారీ సినిమాలు ఈసమ్మర్ రేసులో వస్తాయి అంటూ ఇండస్ట్రీ వర్గాలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: