కొంతకాలం క్రితం వరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఓటిటి లోకి రావడానికి చాలా కొంత సమయం పట్టేది. కానీ ప్రస్తుతం మాత్రం అలాంటి పరిస్థితులు లేవు.  స్టార్ హీరోలు నటించిన సినిమాలు మాత్రమే కొంత ఆలస్యంగా ఓటిటి లోకి వస్తున్నాయి. అదే మీడియం రేంజ్ హీరోల సినిమాలు మరియు చిన్న హీరోల సినిమాలు ఏవైనా థియేటర్ లలో విడుదల అయినా, ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ టాక్ ను సంపాదించుకున్నట్లయితే ఆ సినిమాలు  ఓటిటి లోకి రావడానికి కొంత సమయం పడుతుంది.  కానీ అదే సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడినట్లయితే నెల తిరక్కుండానే ఆ సినిమాలు ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా ఆర్య, రాశి కన్నా ప్రధానపాత్రలో తెరకెక్కిన అంతపురం సినిమా 31 డిసెంబర్ 2021 న థియేటర్ లలో విడుదల అయింది.

  ఈ సినిమా థియేటర్ ల దగ్గర ప్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఇలా థియేటర్ లలో విడుదలై పెద్దగా ప్రేక్షకాదరణ పొందే లేకపోయినా ఈ సినిమాను జీ ఫైవ్ ఓటిటి వారు విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా జనవరి 13 వ తేదీ నుండి జీ ఫైవ్ ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సుందర్.సి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తమిళంలో అరణ్మనై త్రీ పేరుతో విడుదలై అక్కడ మంచి విజయాన్ని సాధించింది. అదే సినిమాను తెలుగులో అంతపురం పేరుతో విడుదల చేశారు. కాకపోతే ఈ సినిమా తెలుగులో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేక పోయింది. ఈ సినిమాను సుందరి సి హర్రర్ సినిమాగా తెరకెక్కించాడు. మరి ఎవరైనా అంతపురం సినిమాను థియేటర్ లో చూద్దాము అని మిస్ అయినవారు ఉంటే త్వరలోనే ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతోంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: