గత కొన్ని రోజులుగా ఈమె ఫలానా సినిమాలో నటిస్తోంది, పలానా సినిమా లో నటిస్తుంది అని వార్తలు వినిపిస్తున్నాయి తప్ప ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అసలు రావడం లేదు. ఏ సినిమాలో నటిస్తుందో కూడా క్లారిటీ లేకపోవడంతో అనుష్క అభిమానులు ఆమె సినిమాల విషయం లో కొంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ ప్రేమకథా చిత్రంలో ఈమె నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ దాని మీద ఇంతవరకు ఎవరూ కూడా అధికారిక ప్రకటన చేయకపోవడం ఈ సినిమా ఉందో లేదో అన్న అనుమానాలను కలిగిస్తోంది.
పోనీ సీనియర్ హీరోల సరసన ఈమె నటిస్తుదేమో అని ఎదురు చూసిన అభిమానులకు ఆ విషయం లోనూ నిరాశే కలుగుతుంది. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో సీనియర్ హీరోలు అయిన చిరంజీవి నాగార్జున బాలకృష్ణ వెంకటేష్ వంటి హీరోల సరసన ఈమె నటిస్తుందేమో నని ఆమె అభిమానులు భావించారు. కానీ ఆమె వారి సినిమాలు ఒప్పుకోవడం లేదో లేక వారి సినిమాల అవకాశాలు రావడం లేదో తెలియదు కానీ ఈ సినిమాలో అనుష్క కనిపించడం లేదు. తాజాగా చిరంజీవి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటించబోతోంది అన్నట్లుగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తొందరలోనే ఉంది.