పందెంకోడి సినిమాతో తెలుగులోకి భారీ ఎంట్రీ ఇచ్చాడు హీరో విశాల్. తెలుగువాడే అయిన తమిళ సినిమా పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకునీ అక్కడ బాగా రాణించాడు. ఆయన తెలుగు ప్రేక్షకులను కూడా తన సినిమా లతో బాగానే అలరిస్తున్నాడు అని చెప్పొచ్చు. పందెంకోడి  సినిమాను తెలుగులోకి తీసుకువచ్చి తొలి చిత్రంతోనే భారీ విజయాన్ని అందుకున్న విశాల్ అతను తెలుగు వాడే అని తెలిసిన తర్వాత అందరూ ఆయనను ఆదరించడం మొదలుపెట్టారు. అలా విశాల్ నటించిన ప్రతి సినిమా కూడా తెలుగులో విడుదల అవుతూ భారీ స్థాయిలో ప్రేక్షకులను మెప్పించడం మొదలుపెట్టింది.

అయితే కెరీర్ తొలినాళ్లలో విశాల్ మంచి మంచి సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి అది సూపర్ హిట్ అయ్యేలా చేసుకొనేవాడు. కానీ ఆయన తన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను బాగా బోర్ కొట్టిస్తున్నాడు అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ అవుతుంది. ఆయన సినిమాల్లో కాన్సెప్ట్ బాగానే ఉంటుంది కానీ స్క్రీన్ ప్లే హీరో ఎలివేషన్ విషయంలో చేసే పొరపాట్లు విశాల్ సినిమా సూపర్ హిట్ కానివ్వకుండా చేస్తుంది. గత నాలుగేళ్లలో విశాల్ నటించిన ఏ ఒక్క సినిమా కూడా భారీ స్థాయిలో విజయం సాధించలేదు అంటే విశాల్ ఎంత వెనుకబడి పోయాడో అర్థం చేసుకోవచ్చు. 

ఆయనతో పాటు వచ్చిన కొంతమంది తమిళ హీరోలు ఆ తర్వాత వచ్చిన తమిళ హీరోలు మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ భారీ స్థాయిలో మార్కెట్ సంపాదించుకుంటే తెలుగువాడైన విశాల్ ఈ విధంగా వెనక పడిపోవడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఇక తాజాగా సామాన్యుడు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విశాల్. మరి మంచి టైటిల్ తో సామాజిక స్పృహ ఉన్న కథ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సామాన్యుడు సినిమాతో మళ్లీ విజయం అందుకొని ఫామ్ లోకి వస్తాడా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: