టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా ఇటీవల విడుదలై ఏ రేంజ్ లో హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు, డైలాగులు వరల్డ్ వైడ్ గా పాపులర్ అయ్యాయి. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ కి జోడిగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించింది. ఇక ఇప్పటికీ సోషల్ మీడియాలో పుష్ప పాటలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా పాటలకు సామాన్య ప్రజల నుంచి మొదలు పెట్టుకుంటే స్టార్ సెలబ్రిటీల వరకు అందరూ సోషల్ మీడియా లో రీల్స్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమాలోని శ్రీవల్లి పాటకైతే ప్రపంచం నలుమూలల నుంచి రీల్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాటకి చాలా మంది సినీ ప్రముఖులు, టీవీ సెలబ్రిటీలు, క్రికెట్ సెలబ్రిటీలు రిల్స్ చేసిన సంగతి తెలిసిందే అయితే. తాజాగా ఇప్పుడు బాలీవుడ్ కొరియోగ్రాఫర్, బాలీవుడ్ హీరోయిన్ రిల్ చేశారు. శ్రీవల్లి హిందీ వెర్షన్ పాటకి బాలీవుడ్ కొరియోగ్రాఫర్ ఆదిల్ఖాన్, బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా కలిసి డాన్స్ చేశారు. ముందుగా బ్లాక్ డ్రెస్లో కొరియోగ్రాఫర్ ఆదిల్ఖాన్, డైసీ షా ఈ పాటని ప్రాక్టీస్ చేసి.. ఆ తర్వాత పుష్పరాజ్, శ్రీవల్లి గెటప్స్ లో మారి పోయి డాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే ఈ ఇద్దరూ ఈ వీడియోలో పుష్పరాజ్, శ్రీవల్లి గెటప్స్ అచ్చు దింపేసారు. ఆ గెటప్స్ కూడా వీరికి బాగా సూట్ అయ్యాయని ఈ వీడియో చూసిన అభిమానులు కామెంట్ చేస్తున్నారు. ఆదిల్ ఖాన్, డైసీ షా డాన్స్ చూస్తుంటే పుష్ప రాజ్, శ్రీవల్లి నిజంగా కలిసి డాన్స్ చేశారా అన్నట్లుగా ఉందని అంటున్నారు అభిమానులు. అయితే శ్రీవల్లి పాటలోని స్టెప్స్ ని వీరికి తగ్గట్టుగా మార్చుకుని కొత్తరకంగా డాన్స్ వేశారు ఈ బాలీవుడ్ జంట. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి డాన్స్ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. మొత్తం మీద రోజు రోజుకీ పుష్ప క్రేజ్ మాత్రం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతూనే ఉంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి: