డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన అత్యధిక భారీ బడ్జెట్ చిత్రం అర్ అర్ అర్. ఈ సినిమా ఎంత ఘన విజయాన్ని అందుకుందో మనం చెప్పనవసరం లేదు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి నెల కావస్తున్నా ఇప్పటికీ కలెక్షన్ల పరంగా సునామీ సృష్టిస్తోంది.. ఒకవైపు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటోంది.. మరొకవైపు సరికొత్త రికార్డు లతో దూసుకు పోతోంది. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పలు వీడియో సాంగ్ లు కూడా విడుదలయ్య యూట్యూబ్ ని షేక్ చేస్తున్నాయి. ఇప్పటివరకు నాటు నాటు, దోస్తీ, కొమ్మ ఉయ్యాల.. వంటి సాంగ్స్ విడుదల సోషల్ మీడియాలో చాలా ట్రెండీగా మారాయి.

అయితే తాజాగా తారక్ ,చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన స్పెషల్ సప్రైజ్ పాట.. ఎత్తర జెండా వీడియో పాటలు విడుదల చేయడం జరిగింది ఈ చిత్ర మేకర్స్. అయితే ఈ పాట సినిమా లోని చివరి లో వస్తుంది. తాజాగా విడుదలైన ఈ సాంగ్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో రామ్ చరణ్, ఆలియా భట్ , ఎన్టీఆర్ తమ డాన్స్ తో బాగా అదరగొట్టేశారు.


ఇక వీరందరితో బాటుగా హాలీవుడ్ హీరోయిన్  ఓలివియా , అజయ్ దేవగన్, దర్శకుడు రాజమౌళి కనిపించారు. ఇక గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. సంగీతాన్ని మాత్రం ఎం ఎం కీరవాణి అందించారు. ఈ పాటకు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కాన్సెప్ట్ ను డిజైన్ చేశారు. ఇక కొరియోగ్రాఫర్గా హరీష్ చేయడం జరిగింది.. తెలుగులో పాటు హిందీ , మలయాళ, తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఈ సాంగ్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా మెప్పించారు. కీలకమైన పాత్రలో హీరోయిన్ శ్రీయ, అజయ్ దేవగన్ నటించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: