టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది ఘోస్ట్' మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం  మనందరికీ తెలిసిందే. ది ఘోస్ట్ మూవీ షూటింగ్ ప్రారంభం అయి చాలా కాలం అవుతున్న అనివార్య కారణాల వల్ల 'ది ఘోస్ట్' మూవీ షూటింగ్ కొంత కాలం పాటు వాయిదా పడింది. కొంతకాలం పాటు వాయిదా పడిన 'ది ఘోస్ట్' మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే తిరిగి ప్రారంభం అయ్యింది.  ఇప్పటికే గోవా , దుబాయ్ , ఊటీ లలో దాదాపు 66 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్  జరిగింది.  

ఇక ఇప్పటికే 'ది ఘోస్ట్' మూవీ  షూటింగ్ చాలా భాగం పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే 'ది ఘోస్ట్' మూవీ ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 'ది ఘోస్ట్'  సినిమా ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ఈ నెల 12 వ తేదీ నుండి హైదరాబాద్ లో ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.  ఈ ఆఖరి షెడ్యూల్ లో భాగంగా నాగార్జున పై కొన్ని కీలక సన్నివేశాలను అలాగే సినిమా లోని క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు  తెలుస్తోంది.  ఈ నెల చివరి వరకు 'ది ఘోస్ట్' మూవీ షూటింగ్ మొత్తం పూర్తి చేసే విధంగా చిత్ర బృందం ప్రణాళికలు వేసుకున్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే ఈ సినిమా టీజర్ ను కూడా విడుదల చేసే ఉద్దేశంతో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం. ది ఘోస్ట్ మూవీ లో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే 'ది ఘోస్ట్' మూవీ లోని నాగార్జున కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. మరి ఇప్పటికే బంగార్రాజు సక్సెస్ తో  ఫుల్ ఫామ్ లో ఉన్న నాగార్జున కు 'ది ఘోస్ట్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: