టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయిన నాగ చైతన్య ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో  నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే లవ్ స్టోరీ , బంగార్రాజు విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ప్రస్తుతం విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థాంక్యూ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

సినిమా జూలై 8 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాతో పాటు అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సింగ్ చద్ద మూవీ లో నాగచైతన్య ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాతో నాగ చైతన్య బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమా ఆగస్టు 11 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా ఉంటే ఈ రెండు సినిమాలతో పాటు నాగ చైతన్య , విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న దూత అనే ఒక వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఈ వెబ్ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ తో నాగ చైతన్య డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇలా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నాగ చైతన్య,  పరశురామ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

నాగ చైతన్య, పరశురామ్ కాంబినేషన్ లో ఎప్పుడూ సినిమా సెట్ అయినప్పటికీ,  అనుకోకుండా పరశురామ్ కు  మహేష్ బాబు తో సినిమా అవకాశం రావడంతో నాగ చైతన్య తో,  పరశురామ్ సినిమా పెండింగ్ లో పడిపోయింది. ఇప్పటికే పరశురామ్,  మహేష్ బాబు తో తెరకెక్కించిన సర్కారు వారి పాట సినిమా విడుదల అవడంతో తిరిగి నాగ చైతన్య సినిమా పై పరశురామ్వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పరశురామ్,  నాగ చైతన్య కు చెప్పిన కథలో కొన్ని మార్పులు చేర్పులు నాగ చైతన్య సూచించినట్లు తెలుస్తోంది. నాగ చైతన్య సూచించిన మార్పులు, చేర్పుల విషయంలో ప్రస్తుతం పరశురామ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నాగ చైతన్య నటించిన మార్పులుచేర్పులు పూర్తి అయిన తర్వాత సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: