సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుచేతనంటే సితార చేసే పనులు చాలా వైరల్ గా మారుతూ ఉంటాయి. చిన్న వయసులోనే బుల్లితెర, వెండితెర పై న వరల్డ్ ఇలా అన్ని చోట్ల కూడా తన స్టార్ డమ్ నిలుపుకున్న ది. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గా ఉంటూ తండ్రి అభిమానులనే కాకుండా తనకంటూ కొంత మంది అభిమానులను కూడా దక్కించుకుంది. ఇక ఇటీవల సర్కారు వారి పాట నుండి వచ్చిన పెన్ని సాంగ్స్ యొక్క లిరికల్ వీడియో లో కనిపించి అందరినీ బాగా ఆకట్టుకుంది.


అందులో సితార వేసిన డాన్స్ ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు. దీంతో ఈ ముద్దుగుమ్మ రాబోయే రోజులో  హీరోయిన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయాన్ని తెలియజేశారు. డాన్స్, సంగీతం ,కరాటే ఆర్ట్స్ ఇంకా పలు రంగాలలో తన ప్రావీణ్యం చూపిస్తోంది. నటిగా కూడా ఇప్పటికీ కనిపించి మెప్పించిన సితార తాజాగా ఇప్పుడు గుర్రపుస్వారి నేర్చుకునే పనిలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. తన ఇన్స్టాగ్రామ్ ద్వారా గుర్రపుస్వారి నేర్చుకుంటూ ఉంటున్నట్లుగా తెలియజేసింది సితార. అయితే హీరోయిన్ కావాలి అనుకుంటే ఇలాంటి ఏ విద్య అవసరం లేదని చెప్పవచ్చు..


కానీ సీతార మాత్రం చాలా కష్టపడి అన్ని విధాలుగా అన్ని విద్యలను నేర్చుకుంటూ తండ్రికి తగ్గ కూతురు అనిపించుకుంటోంది. ఎటువంటి స్టార్ కిడ్ కూడా ఇంతలా కష్టపడడం లేదు. అయినా సితార కష్టపడుతున్న కష్టం నచ్చి ప్రతి ఒక్కరికి చాలా ముచ్చటేస్తుంది. ఈ వయసులో అంతా కూడా బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటూ ఉంటారు కానీ సితార మాత్రం ఎన్నో కలలు నేర్చుకుంటూ మల్టీ టాలెంటెడ్ అనిపించుకుంటోంది. రాబోయే రోజులలో సితార ఉన్నత స్థాయిలో చూడాలని మహేష్ అభిమానులు కూడా భావిస్తున్నారు. మహేష్ బాబు సినిమాలో సీతారామ ఏదైనా చిన్న పాత్రలో నటిస్తుందెమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: