ప్రియాంక జవాల్కర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు..  ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు.అయితే ఈమె  'టాక్సీ వాలా' చిత్రంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ తర్వాత 'తిమ్మరుసు' 'ఎస్.ఆర్.కళ్యాణమండపం' వంటి చిత్రాలతో బాగా పాపులర్ అయ్యింది.ఇదిలావుంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ వరుస గ్లామర్ ఫోటో షూట్లలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇకపోతే మొన్నటికి మొన్న ఈమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. కాగా ఆ ఫోటోల్లో ఆమె ఓ రెస్టారెంట్ లో తన లవర్ తో కూర్చొని ఉన్నట్టు ఊహాగానాలు వినిపించాయి.

అయితే ఆమె లవర్ మరెవరో కాదు క్రికెటర్ వెంకటేష్ అయ్యర్.ఇక  ప్రియాంక జవాల్కర్ కు ఎదురుగా కూర్చున్న వ్యక్తి అతనే అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. ఇదిలావుంటే సోషల్ మీడియాలో వీరు ఒకరినొకరు ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ విషయం పై కూడా గతంలో వీరి పై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఇక  తాజాగా వీటి పై స్పందించారు ప్రియాంక జవాల్కర్. అయితే ఈమె మాట్లాడ్తు  ఆ ఊహాగానాలు అంతా అబద్ధం అన్నట్టు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ప్రియాంక మరోసారి ఆ ఫోటోని షేర్ చేస్తూ.. చూడండి....'ఇక్కడ కనిపిస్తున్న అబ్బాయి ఫోటో అక్కడ మేము ఫోటో షూట్ చేస్తున్న తరుణంలో మాకు ఓ పనిలో సాయం చేయడానికి ఆ అబ్బాయి  వచ్చాడు.

అంతేకాని మీరు అనుకున్నట్టు కాదు.ఇక అతను నా బాయ్‌ఫ్రెండ్‌ అంటూ వార్తలు వస్తుండటంతో 'ఏంటి సంగతని' మా అమ్మ అడుగుతోంది. దానికి నేను ఎం సమాధానం చెట్లను...అంతేకాదు దయచేసి ఇలాంటి కామెంట్స్ రాయడం ఇక ఆపండి అంటూ చెప్పుకొచ్చింది  ప్రియాంక జవాల్కర్.ఇదిలావుంటే ప్రస్తుతం ప్రియాంక చేతిలో ఏ సినిమాలు లేవు. ఇకపోతే గత ఏడాది ఈమె నుండి 3 సినిమాలు వచ్చాయి. అయితే కానీ ఈ ఏడాది ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు.ఇదిలావుంటే  ఈమె నుండి వచ్చిన ఆఖరి చిత్రం 'గమనం' కావడం విశేషం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: