సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా విడుదల తేదీని ముందుగా ప్రకటించడం, ఆ తర్వాత అందుకు అనుగుణంగా షూటింగ్ జరగకపోవడం లేదా ఇతర కారణాల వల్ల సినిమా చెప్పిన తేదీన విడుదల చేయలేక మరొక విడుదల తేదీని ప్రకటించడం అనేది సినిమా ఇండస్ట్రీలో సర్వసాధారణంగా జరిగే విషయమే. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి క్రేజ్ వున్నా మూడు సినిమాలు కూడా చెప్పిన తేదీకి విడుదల కావడం లేదు అని, దాదాపుగా ఆ మూడు సినిమాలు కూడా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ మూడు సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.

అడవి శేషు హీరోగా కైలాష్ కొలను దర్శకత్వంలో హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను 29 జూలై 2022 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా దాదాపుగా ఈ తేదీన విడుదల అవ్వడం కష్టమే అని , ఈ మూవీ విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.


అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా తెరకెక్కుతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాను కొన్ని రోజుల క్రితం ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడినప్పటికీ ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ఈ సినిమా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల వాయిదా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.


సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమాను  ఆగస్ట్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. కాకపోతే ఈ సినిమా కూడా ఆగస్ట్ 12 వ తేదీన విడుదల కావడం కష్టమే అని, దాదాపుగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: