టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా అక్కినేని నాగ చైతన్య ఇప్పటికే పోయిన సంవత్సరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి హీరోయిన్ గా తెరకెక్కిన లవ్ స్టోరీ మూవీ తో మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల అయిన బంగార్రాజు మూవీ తో మరో విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు.

మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ మీద ఉన్న నాగ చైతన్య తాజాగా థాంక్యూ మూవీ లో హీరోగా నటించాడు. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన రాశి ఖన్నా కథానాయికగా నటించగా , విక్రమ్ కె కుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ కి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ జి జులై 22 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో థాంక్యూ సిగిత్ర బృందం ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఇప్పటికే థాంక్యూ మూవీ యూనిట్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ను కూడా  ముగించింది.

ప్రస్తుతం థాంక్యూ మూవీ యూనిట్ అనేక ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా నాగ చైతన్య కూడా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య మాట్లాడుతూ... నాకు బాలీవుడ్ నుండి కత్రినా కైఫ్ అంటే చాలా ఇష్టం,  అలాగే కోలీవుడ్ నుండి నయనతార అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇలా తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య తనకు ఇష్టమైన ఇద్దరు హీరోయిన్ ల పేర్లను చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: