మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ మూవీ లకు ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో క్రేజ్ వుంటుందో మన అందరికీ తెలిసిందే. అమీర్ ఖాన్ నటించిన సినిమాలు ఇండియా వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తాయో ,  బయట దేశాల్లో కూడా అదే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తాయి. ఆ స్థాయిలో అమీర్ ఖాన్ ఇండియా తో పాటు విదేశాల్లో కూడా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  ఇప్పటికే అమీర్ ఖాన్ నటించిన ఎన్నో సినిమాలు భారతదేశంతో పాటు ఇతర దేశాల్లో కూడా అదిరిపోయే రేంజ్  కలెక్షన్ లను వసూలు చేసాయి.

ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే క్రేజ్ ఉన్న అమీర్ ఖాన్ తాజాగా లాల్ సింగ్ చడ్డా అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సరసన కరీనా కపూర్ హీరోయిన్ గా నటించగా , నాగ చైతన్య ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాడు. ఆగస్ట్ 11 వ తేదీన ఈ మూవీ హిందీ తో పాటు తెలుగు , తమిళ భాషల్లో కూడా విడుదల కాబోతుంది. ఈ మూవీ ని తెలుగు లో మెగాస్టార్ చిరంజీవి సమర్పిస్తాడు.  ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థలలో ఒకటి అయిన నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  సంస్థ 160 కోట్ల భారీ ఖర్చుతో కొనుగోలు చేసినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. అలాగే ఈ సినిమా థియేటర్ రిలీజ్ అయిన తర్వాత ఆరు నెలలకు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: