
అయితే ఇటీవల కాలంలో వీరిద్దరి మధ్య పలు విభేదాలు ఉన్నట్లుగా పలు రకాలుగా ఇండస్ట్రీలో వినిపించాయి కానీ అలాంటివి ఏమీ లేదని వార్తలను కొట్టి పారేశారు వీరిద్దరూ తాజాగా ఒక ప్రముఖ ఇంటర్వ్యూ ఛానల్ లో మాట్లాడిన రాజీవ్ కనకాల సుమ పై పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ కథ ఎలా మొదలైందని విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక రాజీవ్ కనకాల మాట్లాడుతూ దూరదర్శన్ కోసం ఒక షూటింగ్ చేస్తున్నప్పుడు సుమాను మొదటిసారి చూశాను బాగానే ఉంది అమ్మాయి అనుకున్నాను కానీ ఆ తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో షూటింగ్ కోసం వెళితే అక్కడ కూడా ఈమె కనిపించడం జరిగింది. అయితే ఈమెను అలా ఒక్క రోజులోనే ఎలా పడేయాలోని ఆలోచనలో ఉన్నానని రాజీవ్ తెలియజేశారు.
అయితే అప్పుడు కేవలం రెండు రోజులు మాత్రమే షూటింగ్ ఉన్నది కానీ అప్పుడు ఏమి జరగలేదు ఆ తర్వాత డైరెక్టర్ మీర్ దర్శకత్వంలో తెలుగువారి పెళ్లి అనే చిత్రీకరణకు వెళ్లగా అందులో పెళ్లి కొడుకు గెటప్పులో నేను ఉన్నాను నా పక్కన వేరే అమ్మాయి చేయవలసి ఉండగా కానీ ఆ తర్వాత సుమాను తీసుకువచ్చారని అలా ఐదు రోజులు షూటింగ్ జరిగింది అని తెలిపారు రాజీవ్.. అలా కొంచెం కొంచెం పరిచయం కాస్త ప్రేమగా మారింది అని తెలియజేశారు 1999లో సుమాత తమ పెళ్లి అయ్యిందని కూడా తెలిపారు. దీంతో వీరిద్దరి మధ్య బంధం చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పవచ్చు.