సూపర్ స్టార్ రజనీ కాంత్ కొంత కాలం క్రితమే పెద్దన్న మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయాన్ని సాధించ లేక పోయింది. ఈ మూవీ చెల్లెలు సెంటిమెంట్ తో తెరకెక్కింది. ఈ మూవీ లో రజనీ కాంత్ కి చెల్లెలు గా కీర్తి సురేష్ నటించింది. పెద్దన్న మూవీ లో నయన తార హీరోయిన్ గా నటించింది.

పెద్దన్న మూవీ తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రజనీ కాంత్ ప్రస్తుతం జైలర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ కి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తుండగా ,  అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఎక్కువ శాతం  ఒక జైలు సెట్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక ప్రధాన పాత్రలో నటించబోతోంది. రజనీ కాంత్ , రమ్య కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కిన నరసింహ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ పై రజనీ కాంత్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో మరో క్రేజీ హీరోయిన్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తదుపరి షెడ్యూల్ లో మిల్కీ బ్యూటీ తమన్నా జైలర్ మూవీ షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో వేసిన ఒక భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. జైలర్ మూవీ కి దర్శకత్వం వహిస్తున్న నెల్సన్ దిలీప్ కుమార్ ఆఖరి సినిమా బీస్ట్ కూడా ఎక్కువ శాతం ఒక మాల్ లోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: