పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా ఫ్యాన్స్ ని చాలా టెన్షన్ పెడుతున్నారని చెప్పవచ్చు. ఆయన సినిమాలు చేయాలని అభిమానులు సైతం కోరుకుంటే ఆయన మాత్రం సినిమాలు నిలిపివేసి రాజకీయాల వైపు ఎక్కువగా దృష్టి పెట్టే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.. జనసేన పార్టీని స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్నారు పవన్ కళ్యాణ్.. పార్టీ కార్యక్రమాల కారణంగా గత మూడు సంవత్సరాల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు ఫాన్స్ కోరిక ప్రకారం మూడేళ్ల విరామం తర్వాత వకీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు.


సినిమా థియేటర్లో ఎలాంటి హంగామా సృష్టించిందో అందరికీ తెలిసిందే.. ఈ సినిమా విడుదల సమయంలో ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు.. ఇక థియేటర్లను ధ్వంసం చేసేలా పవన్ అభిమానులు థియేటర్ల వద్ద ఒక జాతర వాతావరణాన్ని సృష్టించారు. ఇక తర్వాత భీమ్లా నాయక్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ఈ సినిమా తర్వాత హరిహర వీరమల్లు పేరుతో ఒక సినిమాని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు చేస్తాడు అన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కానీ దీనిపైన పవన్ కళ్యాణ్ కూడా ఏ విధంగా స్పందించలేదు.

దీంతో మళ్ళీ అభిమానులకు ఆందోళన పరిస్థితి ఏర్పడింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రాజెక్టు కూడా గత కొన్ని నెలలుగా ఉంటుందా లేదా అన్న విషయంపై సందిగ్ధంతో ఉన్నారు అభిమానులు. అయితే హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ భవదీయుడు  భగత్ సింగ్ సినిమా చేయవలసి ఉన్నది. ఈ ప్రాజెక్టు పైన కూడా ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో సోషల్ మీడియాలో పవన్ అభిమానుల సైతం హరీష్ శంకర్ కు ఈ సినిమా పై క్లారిటీ ఇవ్వమని కోరుకుంటున్నారు. తాజాగా ఒక అభిమాని ట్వీట్ చేయడంతో హరీష్ శంకర్ అదిరిపోయే రిప్లై ఇచ్చారు.. అన్ని ఉంటాయీ.. ఏది మిస్ అవ్వదు.. నన్ను నమ్మండి.. మీ ఎదురుచూపులకు నా సమాధానం త్వరలోనే తెలుస్తుంది అని బదులిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: