‘ఉప్పెన’ సూపర్ సక్సస్ తరువాత కృతి శెట్టి కి వరసపెట్టి ఆఫర్లు వచ్చాయి. అయితే ఆమె వచ్చిన ప్రతి ఆఫర్ ఓకె చేయకుండా చాల సెలెక్టవ్ గా బ్యానర్ వ్యాల్యు దర్శకుడు ఇమేజ్ ఇన్ని దృష్టిలోపెట్టుకుని ఆమె సినిమాలను ఎంపిక చేసుకుంది. ‘ఉప్పెన’ తరువాత వచ్చిన ‘శ్యామ్ సింగరాయ్’ ‘బంగార్రాజు’ మూవీలు మోడరేట్ హిట్ గా మారినప్పటికీ నటిగా ఆమెకు పెద్ద గుర్తింపు తేలేదు.


దీనికితోడు ఆమె తమ పక్కన నటిస్తే మరీ చిన్నపిల్లలా కనిపిస్తుంది అంటూ టాప్ యంగ్ హీరోలు భావిస్తూ ఉండటంతో ఆమె మీడియం రేంజ్ హీరోలతో సరిపెట్టుకోవలసి వస్తోంది. ఆమె లేటెస్ట్ గా నటించిన ‘ది వారియర్’ ‘మాచర్ల నియోజక వర్గం’ మూవీలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో ఆమె కెరియర్ ప్రస్తుతం కష్టాలలో ఉంది. దీనికితోడు ఆమెకు ప్రస్తుత తరం యూత్ లో రష్మిక పూజా హెగ్దేల రేంజ్ లో క్రేజీ సెక్సీ హీరోయిన్ గా ఆమె ఎంత ప్రయత్నించినా గుర్తింపు రావడంలేదు.


ఇప్పుడు ఆమె నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ మూవీలో ఆమె సుధీర్ బాబు పక్కన నటిస్తోంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈమూవీ ఒక డిఫరెంట్ కథ అన్నప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈమూవీ సమ్మర్ లోనే విడుదల కావలసి ఉంది. అయితే భారీ సినిమాలకు భయపడి ఈసినిమాను ఇప్పుడు సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నారు. అయితే ఈమూవీ హీరో సుధీర్ బాబుకు ప్రస్తుతం చెప్పుకోతగ్గ క్రేజ్ కానీ మార్కెట్ కాని లేదు.


ఇలాంటి పరిస్థితులలో ఈమూవీ కూడ ఫెయిల్ అయితే ఆమె హ్యాట్రిక్ ఫెయిల్యూర్ హీరోయిన్ గా రికార్డు క్రియేట్ చేసి ఆమె క్రేజ్ మరింత తగ్గిపోయే ఆస్కారం ఉంది. ఒకవైపు తాను నటించిన మొదటి సినిమా ఫెయిల్ అయినప్పటికీ శ్రీలీల కు చాల మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే కృతి శెట్టికి మాత్రం వరసపెట్టి ఫెయిల్యూర్ లు వస్తూ ఉండటంతో ఆమె కెరియర్ కష్టాలలో ఉంది అంటూ ఇండస్ట్రీలో కామెంట్ వినిపిస్తున్నాయి.. దీనితో ఈ వారం విడుదల కాబోతున్న ఆ అమ్మాయి గురించి  మీకు చెప్పాలి మూవీ ఆమె కేరియర్  కు కీలకం గా మారింది



మరింత సమాచారం తెలుసుకోండి: