మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాల తో ఫుల్ బిజీగా ఉన్నాడు.. మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ సినిమా లూసిఫర్ కి రీమేక్ గా గాడ్ ఫాదర్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. మోహన రాజా దర్శకత్వం లో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో సల్మాన్ ఖాన్, సత్యదేవ్, నయనతార, పూరి జగన్నాధ్.. పలువురు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దసరాకి కానుక గా అక్టోబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.


ఇప్పటికే గాడ్ ఫాదర్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయి సినిమా పై అంచనాలని పెంచేసింది. తాజాగా చిరంజీవి ఓ వాయిస్ ట్వీట్ చేశారు. ఈ వాయిస్ ట్వీట్ లో.. 'రాజకీయానికి నేను దూరంగా ఉన్నాను.. నా నుంచి రాజకీయం దూరం కాలేదు' అని ఉంది. ఈ డైలాగ్ గాడ్ ఫాదర్ సినిమా లోది అని లూసిఫర్ సినిమా చూసిన వాళ్లకి అర్ధమవుతుంది. ఇలా గాడ్ ఫాదర్ సినిమా నుంచి ఓ డైలాగ్ లీక్ చేసి సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేశారు..


ఈ డైలాగ్ చిరంజీవికి కూడా వర్తిస్తుంది. కొన్నాళ్ళు రాజకీయాల్లో ఉన్న చిరంజీవి రాజకీయాలు వదిలేసి మళ్ళీ సినిమాల్లోకి వచ్చారు. అయినా రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి, రాజకీయ నాయకులు పాల్గొనే కొన్ని మీటింగ్స్ లో కూడా పాల్గొంటున్నారు. ఇక తమ్ముడు పవన్ జనసేన పార్టీ కి ఇండైరెక్ట్ గా సపోర్ట్ కూడా ఇస్తారు. ఒకవేళ సినిమా డైలాగ్ అయినా సినిమాలో చాలా డైలాగ్స్ ఉన్నా ఇదే డైలాగ్ ని ఎందుకు పోస్ట్ చేశారు అనే ప్రశ్న తలెత్తు తుంది. ఇలాంటి సమయంలో చిరు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇది సినిమా కోసమా..లేక నిజంగానే రాజకీయాల్లో కి వస్తున్నాడా అనేది తెలియాల్సి ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: