మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారీ ప్రాజెక్టును చేస్తున్న విషయం తెలిసిందే. దిల్ రా జు నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ పై రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇంకోవైపు రామ్ చరణ్సినిమా యొక్క షెడ్యూల్ లో జోరుగా పాల్గొంటున్నాడు.  ఆయ న హీరో గా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా జపాన్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొని ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు చేరే లా చేస్తున్నాడు.

ఆ విధంగా ఇప్పుడు అక్కడి ప్రమోషన్ కార్యక్రమాలు పూర్తి చేయడంతో మళ్లీ ఈ సినిమా యొక్క షూటింగ్లో పాల్గొనడానికి సిద్ధమ వుతు న్నాడు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా తర్వాత చరణ్ చేయబోయే సినిమా ఎవరితో ఉంటుందా అన్న ఆసక్తి ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా ఉంది. వాస్తవానికి రామ్ చరణ్ గౌతమ్ తిన్న నూరి తో కలిసి తన సినిమా చేయవలసి ఉంది.

కానీ చిరంజీవి ఆ ప్రాజెక్టు చేయడానికి నో చెప్పడంతో గౌతమ్ వేరొక హీరోతో ఆ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు గౌతమ్. ఆ విధంగా ఒక మంచి కథను రామ్ చరణ్ కోల్పోయారని కొంతమంది చెబుతున్నారు. అలా శంకర్ సినిమా తర్వాత రామ్ చరణ్ చేయబోయే దర్శకుడు ఎవరు కూడా లైన్లో లేకపోవడం మెగా అభిమానులను ఎంతగానో కలవర పెట్టిస్తుంది. ప్రశాంత్ నీల్ తో సినిమా ఓకే చేసుకున్న కూడా ప్రశాంత్ వేరే హీరోలతో సినిమాలు చేయాల్సి ఉండడంతో చరణ్ సినిమా ఇప్పట్లో మొదలయ్యేలా లేదు. మరి చేతిలో ఉన్న దర్శకుడుని వదిలిపెట్టిన రామ్ చరణ్ ఇప్పుడు ఏ దర్శకుడు తో సినిమా చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: