తెలుగు సినిమా ఇండస్ట్రీ లో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న అల్లరి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లరి నరేష్ తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో కామెడీ సినిమాలలో నటించి తన కామెడీ తో ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాడు. ఇది ఇలా ఉంటే అల్లరి నరేష్ తన కెరియర్ లో ఎక్కువ శాతం కామెడీ మూవీ లలో నటించి ప్రేక్షకులను అలరించినప్పటికీ , కొన్ని కొన్ని సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను అలరించిన సందర్భాలు ఉన్నాయి. అందులో భాగంగా అల్లరి నరేష్ ఇప్పటికే గమ్యం ,  నాంది వంటి మూవీ లలో తన అద్భుతమైన నటన తో ప్రేక్షకులను అలరించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లరి నరేష్ "ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం" అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 

మూవీ లో అల్లరి నరేష్ సరసన ఆనంది హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఏ ఆర్ మోహన్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఇట్లు మారేడుపల్లి ప్రజానీకం మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది. ఇట్లు మారేడ్పల్లి ప్రజానీకం మూవీ ని నవంబర్ 25 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: