టీవీ9 యాంకర్ దేవి నగవల్లి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. ప్రస్తుతం టీవీ9 లో ఆమె టాప్ యాంకర్. వార్తలు చెప్పినా, బిగ్ బాస్ హౌస్ లో నిలపడలేకపోయినా దేవీ నాగవల్లిది ఒక స్పెషల్ క్యారెక్టర్. ఆమధ్య విశ్వక్సేన్ పాగల్ సినిమా ఇంటర్వ్యూలో.. చేసిన ఒక ఫ్రాంక్ వీడియోను ఉద్దేశించి ఆమె చేసిన గేట్ అవుట్ వ్యాఖ్య ఎంతటి సంచలనం సృష్టించిందో తెలుసు కదా. ఇక ఇందులో ఓ వర్గం దేవిదే తప్పు అంటే.. వర్గం విశ్వక్సేన్ పై వేలు ఎత్తి చూపింది. ఇంత చేసినప్పటికీ ఆ పాగల్ సినిమా పిచ్చి సినిమా అయిపోయింది..అయితే పాపం దేవి నాగవల్లికి ఆవేశం ఎక్కువ.. 

భాష మీద పట్టు తక్కువ. ఇప్పుడున్న రోజుల్లో ఎవరికి తెలుగు వస్తోంది కనుక.. అప్పుడెప్పుడో రుధిర వర్షాన్ని కురిపించిన ఆమె నోరు.. ఇక ఇప్పుడు చప్పున చల్లారినట్టే కనిపిస్తోంది. ఇమ ఇలా ఎందుకు అనిపిస్తోందంటే ఆ పాగల్ విశ్వక్సేన్ అలియాస్ మాస్ కా దాస్ స్వయంగా మెగా ఫోన్ పట్టుకున్నాడు.. అసలే మెంటల్ క్యారెక్టర్ కదా.. చక చకా సినిమా తీసి పారేశాడు. తనకు సన్నిహితమైన నివేదా పేతు రాజ్ ను పెట్టుకున్నాడు. అయితే ఇద్దరు కూడా సహజీవనం చేస్తున్నారని టాక్. ఈ విషయం పక్కన పెడితే ఆ సినిమా పోస్టర్, ఒక చిన్నపాటి వీడియోను బాలకృష్ణ వెళ్లి ఆవిష్కరించాడు..

ఇంతవరకు బాగానే ఉన్నా ఆ సదరు విశ్వక్సేన్ ఈ సినిమాలో టీవీ9 దేవిని ఉద్దేశించి ఒక చిల్లర, వెగటు సీన్ పెట్టాడు. ఇకపోతే గతంలో వీరి మధ్య జరిగిన పాత వివాదం తెలుసు కదా! మరి హీరో కదా పైగా బాలయ్య లాంటి ఉద్దండుడి ప్రోత్సాహం ఉంది.అయితే  ఇంకేముంది అంతటి అర్జున్ సినిమాను కూడా పక్కన పెట్టాడు. అసలు విశ్వక్ సేన్ ఏం చేసినా ఒక వివాదమే. ఇక నిండా అహం, పైగా తల పొగరు.. అతని నుంచి ఇంతకంటే ఎక్కువ ఏం ఆశించగలం.. బహుశా విశ్వక్ ప్రవర్తనను ఇప్పట్లో అర్జున్ మర్చిపోకపోవచ్చు.ఇక టీవీ9 వివాదం అక్కడే సమసి పోయింది. ఇంకా గెలికితే పెంట అవుతుంది.. కానీ దాన్ని విష్వక్ అలాగే కడుపులో ఉంచుకున్నాడు.. ఇక తాను తీస్తున్న సినిమా కాబట్టి… దేవి అంటే కోపం ఉంది కాబట్టి… తన చిల్లర తనాన్ని మరోసారి ప్రదర్శించాడు.. ఈ దమ్కీ అనే సినిమాలో కారులో తను వెళుతూ ఉంటాడు.అయితే  పక్కన హీరోయిన్ కూర్చుంటుంది.. ఒక ముద్దు పెడుతుంటుంది.ఇక  హీరో కదా… అందులో తానే దర్శకుడు. సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడు.. మెడికల్ షాప్ దగ్గర ఆపాలా అని అడుగుతాడు.. ఇందులో ఎంత దరిద్రం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ హీరోయిన్ వెంటనే గేట్ అవుట్ ఫ్రమ్ మై కార్ అంటుంది.. అర్థమైంది కదా ఈ సీన్ ఎవరి మీద ప్రతికారమో… అతడి అభిరుచి స్థాయి ఏంటో..!?

మరింత సమాచారం తెలుసుకోండి: