సాధారణంగా కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించకపోయినా.. ఆ తర్వాత ఓటీటీలోకి వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలు చాలానే ఉన్నాయి. అలా ఈ క్రమంలోనే నాని నటించిన అంటే సుందరానికి సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందింది. అంతేకాదు ఇందులో ఈసారి సరికొత్తగా బ్రాహ్మణుడి అవతారంలో కనిపించిన నానిసినిమా విజయవంతం అవుతుంది అని అందరూ అనుకున్నారు. అంతేకాదు ఇందులో హీరోయిన్ గా రాజారాణి ఫేమ్ నజ్రియా నజీమ్ కూడా మొదటిసారి డైరెక్టుగా తెలుగు సినిమాలో నటించింది. దీంతో అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఈ సినిమాలో ఆమె పాత లుక్ లో లేదని తనలో పూర్తిస్థాయిలో మార్పులు వచ్చాయి అంటూ విమర్శించారు. అలా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ పరాజయాన్ని చవిచూసింది.

కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమాకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తూ ఉండడం గమనార్హం.  2022 కు గాను ఉత్తమ 10 చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకోవడం నిజంగా అరుదైన విషయమని చెప్పాలి. ఇటీవల 2022లో ఉత్తమ చిత్రాలకు పోల్ జరగగా అందులో అంటే సుందరానికి సినిమాని కూడా నెటిజెన్లు చర్చించడం గమనార్హం.  అలాగే తమిళ్ ప్రేక్షకులకు కూడా ఈ చిత్రాన్ని ల్యాప్ చేసి థంబ్స్ అప్ కూడా ఇచ్చారు. మొత్తానికైతే థియేటర్లలో ఆశాజనకంగా ఆడిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ నెటిజన్ల మన్ననలు మాత్రం పొందింది అని చెప్పవచ్చు.


మెంటల్ మదిలో,  బ్రోచేవారెవరురా వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన వివేక్ ఆత్రేయ ఈ సినిమాను డైరెక్టర్ చేయడంతో పాటు movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను రూపొందించారు.  దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రాహ్మణ యువకుడు, క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించుకుంటారు వాళ్లు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు వారికి ఎదురయ్యే సమస్యలు ఎలా ఉంటాయనే విషయాన్ని ఎంటర్టైనింగ్ గా చెప్పారు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: