
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడీయోస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మించారు. సముద్రఖని, తనికెళ్లభరణి, సాయికుమార్, నర్రా శ్రీనివాస్ మరియు హైపర్ ఆది ప్రధాన పాత్రల్లో నటించారు.
ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన టాక్ తో నడుస్తుంది.. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను అయితే రాబడుతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ చిత్రం మూడు రోజుల్లో నే లాభాలను సాధించింది.. విద్యా వ్యవస్థ విధానాల తో సాగే కథాంశంతో సార్ మూవీని తెరకెక్కించారు. విద్యా వ్యవస్థలో ఉన్న అక్రమ వ్యాపారాలను ఈ చిత్రంలో బాగా చూపించారు.సామాజిక స్పృహను కలిగించే అంశాలు కూడా ఇందు లో ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులకు బాగా ఆకట్టు కుంటుంది..
ఇకపోతే సార్ మూవీ కి ముందు అనుకున్న హీరో ధనుష్ కాదట. టాలీవుడ్ కు చెందిన ఓ హీరో ఈ సూపర్ హిట్ మూవీని అయితే రిజెక్ట్ చేశాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు.. న్యాచురల్ స్టార్ అయిన నాని. వెంకీ అట్లూరి సార్ కథను మొదట నానికి వినిపించాడని సమాచారం.. అయితే కథ నచ్చినప్పటికీ కూడా వరుస కమిట్మెంట్ ల కారణంగా ఆయన ఈ సినిమాను సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం.. ఆ తర్వాత ధనుష్ వద్దకు ఈ కథ వెళ్లడం ఆ కథను ధనుష్ ఓకే చేసి సినిమా చేయడం అంతా చకచకా జరిగి పోయాయి.. ఇప్పుడు సార్ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది..