జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయ సమావేశాలతో పాటు తన సినిమా షూటింగ్స్ లోను పాల్గొంటున్నాడు. ప్రస్తుతానికి జనసేన పార్టీ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం వేడుకలు జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకల అనంతరం తిరిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ముందు వినోదయ సీతం రీమేక్ షూటింగ్ పూర్తి చేస్తాడు. దీంతో పాటు వచ్చే నెలలో మరో రెండు సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ ఓ జి రెండు వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్ళబోతున్నాయి. ఇక దర్శకుడు సుజిత్ ఇప్పటికే ఓజి కు సంబంధించి ఫుల్ స్క్రిప్ ని సిద్ధం చేసి షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకున్నాడట. 

ఇక పవన్ డేట్ ఇస్తే వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటున్నాడు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ సుజిత్ ల ఓజీ కథకు ముంబై నేపథ్యాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా కథ జపాన్లో మరియు జపనీస్ అంశాలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా ముంబై బ్యాక్ డ్రాప్ లో నడిచే కథగా ఈ సినిమా ఉండబోతుందట. భారీ క్రిష్ తో కూడిన గ్యాంగ్ స్టార్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ముంబైలోనే జరుగుతుందని అంటున్నారు.డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.

ఇక ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తీసుకునే రెమ్యూనరేషన్ కూడా హాట్ టాపిక్ గా మారింది. పవన్ కళ్యాణ్ ఏ సినిమాకి కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చాడని 20 రోజుల కోసం పవన్ ఏకంగా 75 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటున్నాడని ఇప్పటికే వార్తలు వినిపించాయి. మరోవైపు దర్శకుడు సుజిత్ ఈ సినిమాతో ఎలాగైనా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. అందుకే పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ఈ ఓజీ స్క్రిప్ట్ను పక్కాగా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.ఇక వీలైనంత తక్కువ సమయంలో షూటింగ్ పూర్తి చేసి వచ్చేది సినిమాని విడుదల చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం ఆలస్యం చేయకుండా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో జాయిన్ కానున్నాడు పవన్ కళ్యాణ్...!!

మరింత సమాచారం తెలుసుకోండి: