తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ప్రియదర్శి తాజాగా బలగం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ లో కావ్య కళ్యాణ్ రామ్ ... ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటించగా ... ఎన్నో సినిమాల్లో కామెడీ పాత్రలో నటించి ... ఎన్నో టీవీ షో లో పాల్గొని ఎంతో మంది ని ఎంటర్టైన్ చేసిన కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. ఆ తర్వాత ఈ మూవీ కి సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఈ మూవీ ఇప్పటి వరకు 16 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 16 రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకుందాం.

మూవీ 16 రోజుల్లో నైజాం ఏరియాలో 10.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా ... ఆంధ్ర మరియు సీడెడ్ లో 5.86 కోట్లు కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ 16 రోజుల్లో 7.40 కోట్ల షేర్ ... 16.26 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లో ఈ మూవీ 16 రోజుల్లో 37 లక్షల కలెక్షన్ లని వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 5.57 కోట్ల షేర్ ... 16.63 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: