బుల్లితెరపై యాంకర్ అనసూయ కెరియర్లో ఎదిగిన తీరు చూస్తే అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పవచ్చు.. హీరోయిన్ కావాలనే కోరికతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనసూయకి.. అవుట్ ఆఫ్ ఫోకస్ రోల్స్ లో మాత్రమే అవకాశాలు దక్కాయి.. దీంతో కొద్ది రోజులు అనసూయ జాబ్ కూడా చేసింది. ఆ తర్వాత 2013లో జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ ఒక్కటి అనసూయ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసిందని చెప్పవచ్చు. ఈ షో వల్ల ఆమె దశ తిరిగిపోయింది.

అనసూయ ఎప్పుడు ఊహించని విధంగా ఆమె క్రేజ్ సొంతం చేసుకుంది. హీరోయిన్ కావాలన్నా కల జబర్దస్త్ యాంకర్ కావడం ద్వారా ఈమె కల నెరవేరింది. దాదాపుగా తొమ్మిదేళ్లుగా అనసూయ జబర్దస్త్ లో పనిచేయడం జరిగింది.  మొదట్లో వ్యక్తిగత కారణాలవల్ల కొంత దూరంగా ఉన్నప్పటికీ ఆ సమయంలో రష్మీ ఎంట్రీ ఇచ్చింది. దీంతో జబర్దస్త్ సక్సెస్ కావడంతో ఎక్స్ట్రా జబర్దస్త్ లోకి రష్మి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఇక ఇదే సమయంలో అనసూయ మీద కొన్ని వ్యతిరేక విమర్శలు కూడా ఎక్కువగా వినిపించాయి.
ఫ్యామిలీ ఆడియన్స్ చూసే షో లో అనసూయ వేసుకునే దుస్తులపైన వివాదానికి దారితీసింది.అయితే ఈ విమర్శలను సైతం అనసూయ తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. తనను తన డ్రెస్సింగ్ ని జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదు అంటూ కూడా ఘాటుగా స్పందించింది. ప్రతివారం ఒక ఎపిసోడ్ కు సరికొత్త డ్రెస్ తో ఫోటోషూట్లను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటుంది అనసూయ. తాజాగా అనసూయకు సంబంధించి ఐదేళ్ల క్రితం దిగిన కొన్ని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. అప్పుడు నేను ఇలా ఉండే దాన్ని అలాగే నాకు ఈ కాస్ట్యూమ్స్ అంటే చాలా ఇష్టమని కూడా తెలియజేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: