మెగా స్టార్ చిరంజీవి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ల సినిమాల స్పీడ్ మామూలుగా లేదు. 67 సంవత్సరాల చిరంజీవి వరసపెట్టి అలసట లేకుండా సినిమాలు చేస్తున్నాడు. తన అన్న రేంజ్ కి మించి పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలలో చాల బిజీగా ఉంటూనే మరొక వైపు వరసపెట్టి సినిమాలను పరుగులు తీయిస్తున్నాడు.


‘వాల్తేర్ వీరయ్య’ ఇచ్చిన ఉత్సాహంతో మరింత స్పీడ్ ను పెంచి చిరంజీవి నటిస్తున్న ‘భోళాశంకర్’ మూవీలో కొన్ని ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఉన్నాయట. ఈ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కు నేపధ్యంగా కలకత్తా సిటీని ఎంచుకున్నట్లు సమాచారం. గతంలో చిరంజీవి నటించిన ‘చూడాలని ఉంది’ కలకత్తా బ్యాక్ డ్రాప్ సీన్స్ ఆసినిమా ఘన విజయానికి ఎంతగానో సహకరించాయి.


ఇప్పుడు అదే సెంటిమెంట్ ను పాటిస్తూ ‘భోళాశంకర్’ మూవీలో కలకత్తా బ్యాక్ డ్రాప్ ను చూపెడుతున్నట్లు టాక్. భాగ్యనగరంలోని ఒక ప్రముఖ స్టూడియోలో కలకత్తా పరిసరాలను అదేవిధంగా కలకత్తా పరిస్థితులను గుర్తుకు తెచ్చే విధంగా ఒక భారీ సెట్ వేసి అక్కడ ఈ మూవీ షూటింగ్ ను పరుగులు తీయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు పవన్ సుజిత్ ల కాంబినేషన్ లో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న ‘#ఓజీ’ షూటింగ్ వచ్చేనెల నుండి ప్రారంభం కాబోతోంది.


ఈ మూవీలో ఒక పవర్ ఫుల్ ముంబాయి బ్యాక్ డ్రాప్ ఉన్నట్లు సమాచారం. ఈమూవీలో పవన్ ‘గ్యాంగ్ ష్టర్’ గా చేస్తున్నాడు. దీనికోసం ముంబాయి మాఫియా సామ్రాజ్యాన్ని పోలి ఉండే ఒక భారీ సెట్ ను నిర్మించి హైదరాబాద్ లోనే ఈమూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించబోతున్నారు. గతంలో పవన్ కు సంబంధించిన కొన్ని సినిమాలు ముంబాయిలో తీసినప్పుడు అవి హిట్ అయిన సెంటిమెంట్ ను నమ్ముకుని పవన్ సినిమాకు బొంబాయ్ బ్యాక్ డ్రాప్ ను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇలా అన్నదమ్ములు ఇద్దరూ కలకత్తా ముంబాయి లను పంచుకున్నారు అనుకోవాలి..
మరింత సమాచారం తెలుసుకోండి: