టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా కొనసాగుతున్న సంయుక్త మీనన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన అభిమాన సినిమాలో రానాకు భార్యగా నటించింది. దాని అనంతరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాలో కూడా నటించింది. దాని తర్వాత ఇటీవల ధనుష్  హీరోగా నటించిన సార్ సినిమాలో కూడా హీరోయిన్గా నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది ఈమె.దాంతో టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్గా కొనసాగుతుంది. అనంతరం వెంటనే మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాలో కూడా హీరోయిన్గా నటించింది సంయుక్త. 

ఈ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె ఏకంగా 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా ఊహించిన స్థాయిలో విజయాన్ని అందుకుంది.ఈ సినిమా హిట్ అవ్వడం తో ఈ సినిమాతో గోల్డెన్ లోకి హీరోయిన్ గా చెరగని ముద్ర వేసుకుంది  సంయుక్త. 100 కోట్ల సినిమా వచ్చిన తర్వాత ఏ హీరోయిన్ కూడా కామ్ అవ్వదు. కానీ ఈ సినిమా తర్వాత సంయుక్త మీనన్ మరో కొత్త సినిమాకి కమిట్ అవ్వలేదట. విరూపాక్ష సినిమా సక్సెస్ తర్వాత ఈమెకి మరో సినిమాలో అవకాశాలు రాలేదు అన్న వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. కానీ ఈమె మాత్రం ఇప్పటికే రెండు మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఈమె ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకోవాలంటే ఖచ్చితంగా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రమే నటించాల్సి ఉంటుంది .ఇక ఇలాంటి ఒక స్టార్ హీరోయిన్ కి ఏ స్టార్ హీరో సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశం వస్తుందో చూడాలి. ప్రస్తుతం విరుపాక్ష సినిమా తర్వాత సైలెంట్ గా ఉన్న సంయుక్త త్వరలోనే తన కొత్త సినిమాను అనౌన్స్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. దీంతో సంయుక్త కి సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: