మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఉపాసన గర్భవతి అనే విషయం అందరికీ తెలిసిందే. ఇక గర్భవతి అయినప్పటికీ ఆమె ఆస్కార్ అవార్డు కార్యక్రమాలకు హాజరైంది. దాంతోపాటు ప్రస్తుతం వరుస ప్రైవేటు కార్యక్రమాలకు కూడా హాజరవుతోంది ఉపాసన. కానీ ఈ మధ్య మాత్రం ఉపాసన అసలు పబ్లిక్ లో కనిపించడం లేదు. దాంతో ఉపాసన డెలివరీ సమయం దగ్గరికి వచ్చిందంటూ అందరూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక మెగా కాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం మేరకు ఉపాసనకి జూన్ లేదా జూలై నెలలో ఖచ్చితంగా డెలివరీ అవుతుంది అని తెలుస్తోంది. 

ఈ నెలల్లోనే కచ్చితంగా మెగా ఇంట్లో వారసుడు అడుగు పెట్టబోతున్నాడు అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తనయుడు పుట్టాలన్నది మెగా అభిమానుల కోరిక. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం తనకి వారసుడు పుట్టాలని అనుకుంటున్నాడు. అంతేకాదు మెగా కుటుంబంలో బుల్లి మెగాస్టార్ చిరంజీవి మళ్ళీ పుట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు. ఇక రామ్ చరణ్ దంపతులకు పుట్టబోయేది పాప బాబా అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. ఇక వీరిద్దరికీ పెళ్లి జరిగి దాదాపు పది సంవత్సరాలు కావస్తున్నప్పటికీ వీరిద్దరికీ సంతానం లేదు.

దీంతో రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ ఆనందాలకు కూడా హద్దులు లేకుండా పోయాయి. త్వరలోనే మెగా కుటుంబంలో వారసుడు వారసురాలు రాబోతుంది అని మెగా అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. అంతేకాదు ఏ క్షణంలోనైనా మెగా ఫ్యామిలీ నుండి ఈ శుభవార్త వినేందుకు రెడీగా ఉన్నారు మెగా ఫ్యాన్స్. దీంతో ఉపాసన డెలివరీ కి సంబంధించిన ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: