దిగవంత స్టార్ హీరోయిన్ ఆర్తి అగర్వాల్ చెల్లెలు అతిథి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లు అర్జున్ నటించిన గంగోత్రి సినిమాలో హీరోయిన్గా నటించి తన సినీ కెరియర్ ని ప్రారంభించింది.కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2008లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో అతిథి అగర్వాల్ తన అందం అభినయం తన నటనతో ఎందరినో ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా చూశాక చాలామంది ఆర్తి అగర్వాల్ కంటే పెద్ద హీరోయిన్ అవుతుందని ఆమెపై పొగడ్తల వర్షం కురిపించారు. 

కానీ అందరూ చెప్పినట్లుగా జరగలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో నటించిన గంగోత్రి సినిమా తర్వాత కొడుకు విద్యార్థి ఏం బాబు లడ్డు కావాలా వంటి సినిమాల్లో నటించిన అయినప్పటికీ కెరియర్లో హీరోయిన్గా నటించినప్పటికీ నిలదొక్కుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆశించిన స్థాయిలో హీరోయిన్గా సక్సెస్ కాలేకపోయింది.ఇక తన అక్క ఆర్తి అగర్వాల్ మరణం తర్వాత అతిధి అగర్వాల్ పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ తన సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండదు అతిథి అగర్వాల్.

ప్రస్తుతం ఆమె న్యూయార్క్ లో స్థిరపడింది అక్కడే పలు వ్యాపారాలు చేస్తూ బిజీగా ఉంది సినిమాలకు దూరమైన ఈమె అప్పటి అందంతోనే కొనసాగుతుంది. సినిమాలకు దూరమైనప్పటికీ చెరగని అందంతో మెరిసిపోతోంది అతిథి అగర్వాల్. నాలుగుపదుల వయసుకు చేరువవుతున్నప్పటికీ ఇంకా అంటే యంగ్ గా కనిపిస్తోంది అతిథి అగర్వాల్ .దీంతో ఆమె లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజన్స్ అతిథి టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని మంచి సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఈమె ఇంత వయసు వచ్చినప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోలేదు. సింగిల్గానే జీవిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: