ఈ ప్రావిడెంట్ ఫండ్ అనేది ఉద్యోగస్తులకు అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి నెలా వారి జీవితంలో కొంత డబ్బు ప్రావిడెంట్ ఫండ్ కింద కట్ అవ్వడం చూసే ఉంటారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో,  చాలా మంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుండి నిబంధనల ప్రకారం కొంత మొత్తం నగదును,  తమ మొత్తాల నుండి ఉపసంహరించుకుంటున్నారు. అయితే కరోనాతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఉపసంహరణ నిబంధనలను సడలించింది కేంద్ర ప్రభుత్వం. అత్యవసరమైతే తప్పా మీ పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బులు ఉపసంహరించుకోవద్దు అని నిపుణులు సూచిస్తున్నారు.


అయితే పీఎఫ్ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకోవచ్చా..లేదా.. అనేది చాలామంది ప్రశ్న.. అయితే ఓ పీఎఫ్ క్యాలిక్యులేషన్ ప్రకారం పీఎఫ్ అత్యవసరం కాకపోయినప్పటికీ ఉపసంహరించుకుంటే, ఎలా ఉంటుందో చిన్న లెక్క ద్వారా తెలుసుకుకుందాం. ఉదాహరణకు మీరు పీఎఫ్ అకౌంట్ నుండి లక్ష రూపాయల మొత్తాన్ని ఉపసంహరించుకుంటే,  రిటైర్మెంట్ కాలం 30ఏళ్ల అయితే, vఈ కాలానికి గాను మీరు రూ.11 లక్షల రూపాయలు నష్టపోయినట్లు అని చెబుతున్నారు నిపుణులు..


ఇక మీ వయసు 25 సంవత్సరాలు అయ్యి, నెలకు వేతనం రూ.10వేలు అలాగే మీ పీఎఫ్ అకౌంట్ లో లక్ష రూపాయలు సేవ్ చేసి ఉంటే గనుక,  ఉద్యోగి 12 శాతం తో పాటు యజమాని వాటా కూడా ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే మీకు 55 ఏళ్ళు వచ్చేసరికి మీ పీఎఫ్ అకౌంట్ లో రూ.38,14, 260 లక్షలు ఉంటుంది. అంటే 30 ఏళ్ల తర్వాత కాలంలో మీ ఆదాయం రూ.38 లక్షలు అవుతుంది...


ఇక పీఎఫ్ అకౌంట్ నుండి మీరు లక్ష కనుక  ఉపసంహరించుకుంటే, మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సున్నా అవుతుంది.. అనంతరం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొనసాగినప్పటికీ 55 ఏళ్ల తర్వాత కాలానికి  రూ.26,09, 290 అవుతుంది. అంటే మీరు రూ.1లక్ష ఇప్పుడు కరోనా కారణంగా ఉపసంహరించుకుంటే, మొత్తం రూ.14 లక్షలకు పైగా తగ్గుతుందన్న మాట..



మరింత సమాచారం తెలుసుకోండి: