సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో పలు రికార్డ్స్ సృష్టిస్తూ ముందుకు సాగడంతో పాటు సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ లో మరియు సాధారణ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. మహేష్, దిల్ రాజు, అనిల్ సుంకరలు కలిసి ఎంతో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు 81 అడుగుల కటౌట్ ని హైదరాబాద్ లోని సుదర్శన్ 35 ఎం ఎం థియేటర్ వారు అప్పుడే తమ థియేటర్ ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ఇక అక్కడి చూపరులను మరియు మహేష్ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ భారీ కటౌట్, ప్రస్తుతం టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారి వైరల్ అవుతోంది. కేవలం ఒక్క టీజర్ తప్పితే, ఇంకా పూర్తిగా ప్రమోషన్స్ స్టార్ట్ కాకముందే ఈ విధంగా ఇంత భారీ కటౌట్ ఏర్పాటు చేయడం కేవలం సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ మరియు ఫాలోయింగ్ కి నిదర్శనం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. 

 

దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు రత్నవేలు ఫోటోగ్రఫిని, తమ్మిరాజు ఎడిటింగ్ ని అందిస్తున్నారు. మిలిటరీ మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో మహేష్ నటిస్తున్న ఈ సినిమాలో విజయశాంతి, భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తోంది. పలువురు టాలీవుడ్ దిగ్గజ నటులు నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా అందుతున్న సమాచారం ప్రకారం, అతి త్వరలో ఈ సినిమా నుండి తొలి సాంగ్ అతి త్వరలో యూట్యూబ్ లో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: